సూపర్ స్టార్ సినిమాలో మిస్టర్ పర్పెక్ట్ నిస్ట్ న్యూ లుక్!
దీంతో ఇది కేవలం ప్రచారమనుకున్నారంతా. తాజాగా అమీర్ ఖాన్ నేరుగా `కూలీ` సెట్స్ నుంచి అభిమానుల్ని సర్ ప్రైజ్ చేసారు.
సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో `కూలీ` భారీ అంచనాల మధ్య తెరకెక్కు తోన్న భారీ సంగతి తెలిసిందే. స్టార్ హీరోలు కింగ్ నాగార్జున, శాండిల్ వుడ్ స్టార్ ఉపేంద్ర లు కీలక పాత్రలు పోషి స్తున్నారు. ఈ నయా స్టార్ల ఎంట్రీతో సినిమాపై అంచనాలు రెట్టింపు అవుతున్నాయి. ఇదే చిత్రంలో బాలీవుడ్ మిస్టర్ పర్పెక్ట్ నిస్ట్ అమీర్ ఖాన్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు అనే ప్రచారం చాలా కాలంగా జరుగుతోంది.
కానీ ఇంత వరకూ ఖరారైంది లేదు. దీంతో ఇది కేవలం ప్రచారమనుకున్నారంతా. తాజాగా అమీర్ ఖాన్ నేరుగా `కూలీ` సెట్స్ నుంచి అభిమానుల్ని సర్ ప్రైజ్ చేసారు. దీంతో సినిమాలో అమీర్ లుక్ ఎలా ఉంటుందన్నది కూడా తెలిసి పోయింది. డిఫరెంట్ లుక్ లో అమీర్ ఆకట్టుకుంటున్నారు. గెడ్డం...మెలి తిరిగిన కోర మీసాలు.. ముందు భాగంలో కాస్త నెరిసిన తల తో అమీర్ ప్రెష్ లుక్ ఇంట్రెస్టింగ్. కళ్లకు గ్లాసెస్ ధరించారు. పెదాలపై సన్నని నవ్వు చూడొచ్చు.
ప్రస్తుతం ఈ ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది. అమీర్ ఖాన్ నటిస్తున్నారంటే సినిమాలో ఆయన పాత్ర చాలా కీలకమైందిగా తెలుస్తుంది. ఇంత వరకూ ఆయన సౌత్ సినిమాల్లో నటించలేదు. తొలిసారి రజనీకాంత్- లోకేష్ కనగరాజ్ పిలుపు మేరకు నో చెప్పకుండా ముందుకొస్తున్నారు. అమీర్ ఎంట్రీతో సినిమా కి మార్కెట్ పరంగా మరింత కలిసొస్తుంది. రజనీకాంత్- అమీర్ ఖాన్ లకు ఇండియాలోనే కాక వివిధ దేశాల్లోనే మంచి మార్కెట్ ఉంది. అలాంటిదిప్పుడు ఇద్దరు కలిసి నటించడంతో ప్రపంచ దేశాల మార్కెట్ పైనే గురి పెట్టినట్లు కనిపిస్తుంది.
అమీర్ ఖాన్ ఎంత పెద్ద స్టార్ అయినా ఎంతో డౌన్ టౌ ఎర్త్. సౌత్ లో స్టార్ హీరోలందరి తోనూ ఆయనకు మంచి స్నేహం ఉంది. చిరంజీవి, నాగార్జునలతో మరింత క్లోజ్ గా ఉంటారు. అవకాశం వస్తే వాళ్ల సినిమాల్లో సైతం నటిస్తా నని చాలా సందర్భాల్లో అన్నారు. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డుకి ఎక్కగానే...ఆ గౌరవాన్ని అమీర్ ఖాన్ చేతులు మీదుగా అందుకున్న సంగతి తెలిసిందే.