సౌత్ సూపర్ స్టార్ సినిమా లో నార్త్ సూపర్ స్టార్
లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)లో వరుస చిత్రాలు సంచలన విజయాలు సాధించిన సంగతి తెలిసిందే.
లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)లో వరుస చిత్రాలు సంచలన విజయాలు సాధించిన సంగతి తెలిసిందే. కానీ ఇందులో భాగం కాని భారీ యాక్షన్ చిత్రం `కూలీ` గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. లోకేష్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రజనీకాంత్ కథానాయకుడు. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఈ చిత్రం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌లో షూటింగ్ జరుపుకుంటుంది. ఇందులో అమితాబ్ బచ్చన్, శృతి హాసన్, రానా దగ్గుబాటి సహాయక పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీత స్వరకర్త.
`కూలీ` కోసం లోకేష్ ఎంపిక చేసుకుంటున్న తారాగణం ఆశ్చర్యపరుస్తున్నారు. అతడి ఎంపికలు సినీ పరిశ్రమలలో నిరంతరం ముఖ్యాంశాలుగా మారాయి. అక్కినేని నాగార్జున మొదట ఇందులో విలన్ గా నటించాలని భావించారు. కానీ రకరకాల కారణాల వల్ల కన్నడ నటుడు ఉపేంద్ర ఆ పాత్రను దక్కించుకున్నారు.
యాక్షన్ డ్రామా `కూలీ`లో హిందీ నటుడు అమీర్ ఖాన్ సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో స్క్రీన్‌స్పేస్‌ను షేర్ చేసుకోనున్నారనేది తాజా వార్త. అమీర్ ఈ చిత్రంలో అతిధి పాత్రలో కనిపిస్తాడని సోర్సెస్ ధృవీకరించాయి. అయితే దీనిపై అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కి రజనీ అంటే అమితమైన ఆసక్తి.. ప్రత్యేక గౌరవం. అందువల్ల రజనీ చిత్రంలో నటించేందుకు ఆయన అంగీకరించారని అభిమానులు భావిస్తున్నారు.