పాదాభివందనం చేసిన ఐశ్వర్యారాయ్ కుమార్తె!
ఐశ్వర్యారాయ్ ఎక్కడికి వెళ్లినా వెంట తప్పకుండా తన ముద్దుల కుమార్తె ఆరాధ్య మాత్రం ఉంటుంది.
ఐశ్వర్యారాయ్ ఎక్కడికి వెళ్లినా వెంట తప్పకుండా తన ముద్దుల కుమార్తె ఆరాధ్య మాత్రం ఉంటుంది. విదేశాలకు వెళ్లినా....ఫిల్మ్ ఫెస్టివల్స్ కి వెళ్లినా ఆరాధ్య కనిపిస్తుంటుంది. తాతయ్య-నాయనమ్మ-నాన్నల కంటే ఆరాధ్యకు ఎక్కువగా తల్లి అలవాటు. కుమార్తె విషయంలో ఐశ్వర్య కూడా అంతే ప్రేమగా ఉంటుంది. నిరంతరం కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. అన్ని విషయాల్లోనూ తానే దగ్గరుండి చూసుకుంటుంది.
ఇటీవలే దుబాయ్ సైమా వేడుకల్లో కూడా తల్లి-కుమార్తె పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈసందర్భంగా అక్కడో అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. అవార్డు తీసుకోవడానికి హాజరైన సమయంలో విక్రమ్-ఐశ్వర్యారాయ్ ఎంతో ఆప్యాయంగా మాట్లాడుకుంటూ వచ్చారు. అది చూసిన ఆరాధ్య వెంటనే కూర్చున చోట నుంచి లేచి తల్లి వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చింది. తల్లిని ఆప్యాయంగా హత్తుకుంది.
ఆ సమయంలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ అక్కడే ఉన్నారు. ఆయన్ని చూసి ఐశ్వర్యా రాయ్ రెండు చేతులు జోడించి నమస్కరించింది. ప్రతిగా శివరాజ్ కుమార్ అలాగే నమస్కరించారు. అనంతరం ఐశ్వర్యారాయ్ కుమార్తెను శివన్నకు పరిచయం చేసింది. ఆరాధ్య రెండు చోతలు జోడించి నమస్కరిం చింది. అంతటితో ఆగలేదు. శివన్న రెండు కాళ్లకు నమస్కరించింది.
ఆ సమయంలో శివన్న సైతం అంతే నిరాడంబరంగా వ్యవరించారు. ఈ సన్నివేశం ఎంతో చూడము చ్చటగా ఉంది. ఐశర్యారాయ్ లాంటి అందాల నటి కడుపున పుట్టిన ఆరాధ్యకు అంత సంస్కారం ఎవరు నేర్పించారో తెలియదు గానీ... కొన్ని క్షణాల పాటు ఆ సన్నివేశం గుండెల్ని పిండేసింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఐశ్వర్యారాయ్ అభిమానుల్నే కాదు సగటు ప్రేక్షకుడ్ని ఆ వీడియో ఎంతగానో ఆకట్టుకుంటోంది.