డిస్నీ లైబ్రెరీలో నా వాయిస్ 200 ఏళ్లు ఉంటుంది!
మరి సౌత్ లో ...అందులోనూ తెలుగులో ఆ బాధ్యతలు తీసుకునేది ఎవరు? అంటే సూపర్ స్టార్ మహేష్ ని రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే.
హాలీవుడ్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ `ముఫాసా` బాలీవుడ్ డబ్బింగ్ బాద్యతలు మొత్తం కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ ఫ్యామిలీ తీసుకున్న సంగతి తెలిసిందే. సింబ పాత్రకు షారుక్ పెద్ద కుమారుడు ఆర్యన్ ఖాన్, చిన్న కుమారుడు అబ్రామ్ ఖాన్ యువ ముఫాసాకు, ముఫాసా పాత్రకు షారుఖ్ గాత్ర దానం చేస్తున్నారు. ఈ ముగ్గురి ఎంట్రీతో ముఫాసాకి ఎనలేని క్రేజ్ వచ్చేసింది. అసలే హిట్ కంటెంట్ కావడం సహా కింగ్ ఖాన్ ఫ్యామిలీ కూడా తోడవ్వడంతో సినిమాపై అంచనాలు అంతకంతకు రెట్టింపు అవుతున్నాయి.
ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. యూ ట్యూబ్ లో రికార్డు వ్యూస్ తో దూసుకు పోతుంది. నార్త్ వరకూ ముఫాసా వేగం మామూలుగా లేదనే చెప్పాలి. మరి సౌత్ లో ...అందులోనూ తెలుగులో ఆ బాధ్యతలు తీసుకునేది ఎవరు? అంటే సూపర్ స్టార్ మహేష్ ని రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మహేష్ బాబు వాయిస్ ఓవర్ లో రిలీజైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. టాకా పాత్రకు వాయిస్ హీరో సత్యదేవ్, టిమోన్ పాత్ర కు అలీ, పుంబా పాత్రకు బ్రహ్మానందం, కిరోస్ పాత్రకు అయ్యప్ప పి శర్మ వాయిస్ అందించారు. తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో మహేష్ సతీమణి నమ్రతా శిరోద్కర్ కొన్ని విషయాలు పంచుకున్నారు.
`చాలా శ్రద్ధతో ఈ ప్రాజెక్ట్ చేశారు. ఇలాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ని డబ్ చేయడం ఒక ఛాలెంజ్. డిస్నీ టీం చాలా ఎఫెర్ట్ పెట్టి తెలుగు ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నారు. ఇది ఫ్యామిలీ ఫిల్మ్. ఎమోషనల్ రైడ్. మహేష్ బాబు గారు చాలా ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పారు. సినిమా అద్భుతంగా వచ్చింది. తప్పకుండా అందరికీ నచ్చుతుందనే నమ్మకం వుంది` అన్నారు.
`మన వాయిస్ డిస్నీ లైబ్రెరీలో వుండడం అనేది గ్రేట్ ఎచీవ్మెంట్. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిన్న క్యారెక్టర్ చేశాను. ఓ సీన్ లో మహేష్ గారు నాభుజంపై చెయ్యి వేస్తూ మాట్లాడతారు. అప్పుడు నా ఆనందానికి అవధులు లేవు. తర్వాత సరిలేరు నికెవ్వరు లో ఒక క్యారెక్టర్ చేశాను. ఇప్పుడు ఆయనతో కలసి టాకా అనే క్యారెక్టర్ కి వాయిస్ చెప్పడం చాలా ఆనందంగా వుంది. ఈ సినిమాకి డబ్బింగ్ చెప్పిన తర్వాత ఆ ఎమోషన్ లో వుండటం వలన యానిమల్స్ ని చూస్తే తమ్ముడు అన్న అనే ఫీలింగ్ కలిగేది(నవ్వుతూ). ముఫాసా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. మహేష్ గారి పంచస్ అద్భుతంగా పేలాయి` అని సత్యదేవ్ `అన్నారు.
నటుడు అలీ మాట్లాడుతూ, `ది లయన్ కింగ్ సినిమా మన అందరికీ నచ్చింది. ఇప్పుడు ముఫాసా కూడా చాలా అద్భుతంగా వచ్చింది. మహేష్ గారు ముఫాసా కి డబ్బింగ్ చెప్పడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. టిమోన్ పాత్రకు డబ్బింగ్ చెప్పడం నా అదృష్టం. డిస్నీ లైబ్రెరీలో నా వాయిస్ రెండు వందల సంవత్సరాలు వుండిపోతుంది. ఒక యాక్టర్ కి కావాల్సినది ఇదే` అన్నారు. ఈ చిత్రం డిసెంబర్ 20 న ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో రిలీజ్ అవుతుంది.