పియానో టీచర్ గానైనా బ్రతికేయోచ్చు అనుకున్న బన్నీ!
జాతీయ ఉత్తమ నటుడి అవార్డుతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒక్కసారిగా దేశమంతా తనవైపు తల తిప్పి చూసేలా చేసాడు.
జాతీయ ఉత్తమ నటుడి అవార్డుతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒక్కసారిగా దేశమంతా తనవైపు తల తిప్పి చూసేలా చేసాడు. బన్నీకి దక్కిన అరుదైన గౌరవం ఇది. తెలుగు సినిమా చరిత్రలోనే తొలిసారి ఉత్తమ నటుడి అవార్డు అందుకుని చరిత్ర సృష్టించాడు. ఇలాంటి జీవితం అనుకోకుండానే ఆయనకి వచ్చింది. వెనుక సుకుమార్ లాంటి దిగ్గజం ఉండటంతోనే ఇది సాధ్యమైంది. తాజాగా బన్నీ గురించి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలివి. బన్నీ చెన్నైలోనేపుట్టి పెరిగాడు. 18 ఏళ్లు వచ్చేవరకూ అక్కడే ఉన్నాడు.
చదువుల్లో నెమ్మదిగానే ఉండేవాడు. స్కూల్ డేస్ నుంచే ఆటలు..పాటల కార్యక్రమంలో ఎక్కువగా పాల్గొనేవాడుట. పియానో చిన్న నాటి నుంచి వాయించేవారుట. చదువు ఎలాగూ రాలేదు కాబట్టి పియానో టీచర్ గానైనా బ్రతకొచ్చని అనుకునేవాడుట. ఇదే సమయంలో డాన్స్ కూడా నేర్చుకున్నాడు. వెనుక చిరంజీవి ప్రోత్సాహం కూడా ఉంది. గ్రూప్ లో అందరికన్నా బాగా డాన్సు చేసేవారుట. అది చిరంజీవిని బాగా ఆకట్టుకుంది. దీంతో బన్నీకి కొన్ని మెలకువలు చెప్పేవారుట.
తర్వాత జిమ్నాస్టిక్స్ లాంటివి నేర్చుకుని శరీరాన్ని పిట్ గా మార్చడంతో డాన్సులో మరికొంత పర్పెక్షన్ వచ్చిందిట. ఇక బన్నీ కారులో స్కూల్ కి వెళ్లేవారుట. ఆ కారులో మొత్తం ఐదుగురు ఉండేవారుట. బన్నీ అన్నదమ్ములతోపాటు.. మేనత్త పిల్లలు ఉండేవారుట. అల్లు అరవింద్ ఎంత బిజీగా ఉన్నా ఆదివారం వస్తే పిల్లలకే సమయం కేటాయించేవారుట. చెన్నై మెరీనా బీచ్ ఆదివారు తీసుకెళ్లేవారుట.
దారిలో ఉడ్ ల్యాండ్స్ డ్రైవ్ ఇన్ లో భోజనం పెట్టించి అరవింద్ ఇంటికి తీసుకొచ్చేవారుట. అప్పుడప్పు డు మాత్రమే షూటింగ్ లకు తీసుకెళ్లేవారుట. అలా వెళ్లినప్పుడే `విజేత` సినిమా సెట్స్ లో చిన్న పిల్లాడి పాత్ర అవసరం పడటంతో అర్జున్ తో అప్పటికప్పుడు మ్యాకప్ వేయించారు. చదువులో మిగతా పిల్లలు స్పీడ గా ఉండటంతో బన్నీ ఒత్తిడికి గురి అయ్యేవారుట. ఎలాగో కష్టపడి పది పాస్ అయ్యాడు. ఒక లక్ష్యం కోసం పనిచేస్తే ఫలితం ఉంటుందని తొలి పాఠం నేర్పింది ఆ విజయమే.