లేడీ అభిమానికి లిప్ కిస్సులిచ్చి ఫీలవ్వని ఫేమస్ సింగర్!
దీంతో సోషల్ మీడియా వేదికగా అవేం పనులంటే నెటి జనులు మండి పడ్డారు. గాయకుడిగా గొప్ప స్థానంలో ఉండి ఇలాంటి చెడ్డ పనులేంటని విమర్శలకు గురయ్యాడు.
గాయకుడు ఉదిత్ నారాయణ నిర్వహించిన మ్యూజిక్ లైవ్ కాన్సర్ట్ లో భాగంగా లేడీ అభిమానులకు సెల్పీలు తీసుకునేందుకు ముందుకొస్తే ఓ సెల్పీతో పాటు పెదవి ముద్దులు కూడా ఇచ్చి పంపించిన వీడియో నెట్టింట ఎంత సంచలనమైందో తెలిసిందే. ప్రతీగా తీవ్ర విమర్శలు ఎదుర్కున్నాడు. ఓ లేడీ అభిమాని అత్యుత్సాహంతో బుగ్గపై ముద్దు పెడితే ఉదిత్ నారాయణ ఏకంగా అడ్వాటేంజ్ తీసుకుని లిప్ కిస్ ఇచ్చాడు.
దీంతో సోషల్ మీడియా వేదికగా అవేం పనులంటే నెటి జనులు మండి పడ్డారు. గాయకుడిగా గొప్ప స్థానంలో ఉండి ఇలాంటి చెడ్డ పనులేంటని విమర్శలకు గురయ్యాడు. ఈ నేపథ్యంలో ఉదిత్ నారాయణ విమర్శలపై స్పందించాడు. `నాకు , నా కుటుంబానికి చెడ్డ పేరు తెచ్చే పనులు ఎప్పుడూ చేయలేదు. అలాంటప్పుడు ఇప్పుడెందుకు చేస్తానన్నారు. అభిమానులతో నాకు సత్ససంబంధాలున్నాయి. సోషల్ మీడియాలో మీరు చూసింది మా మధ్య ప్రేమ మాత్రమే.
వాళ్లు నన్ను ఏ విధంగా ప్రేమిస్తున్నారో? నేను వాళ్లను అలాగే అభిమానిస్తున్నా. అందుకు నేను చింతిచడం లేదు. నా మనసులో ఎలాంటి చెడు ఉద్దేశం లేదు. కొంత మంది మా స్వేచ్చని తప్పుగా చూస్తున్నారు. అలాంటి వారి విష యంలో బాధ పడుతున్నా. వారి వల్లే నేను అంత ఫేమస్ అయ్యాను. అందుకు వారికి థాంక్స్. ఇతరుల సక్సెస్ చూసి ఎడిచే వారి గురించి పట్టించకోను` అన్నారు.
అలాగే తనకు లతా మంగేష్కర్ అంటే ఇష్టమని ఆమెలా భారతరత్న అందుకోవాలని ఆశపడుతున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే ఆ లేడీ అభిమాని కూడా పబ్లిక్ గా గాయకుడిపై అంత అభిమానం చూపించడం సరికాదని విమర్శలకు గురవుతుంది. అభిమానాన్ని, అత్యుత్సాహాన్ని అదుపులో ఉంచుకోవాలని నెటి జనులు సూచిస్తున్నారు.