కిరణ్ అబ్బవరం..మరో సర్ ప్రైజ్

ఇదిలా ఉంటే ఈ కిరణ్ అబ్బవరం తో మూవీస్ చేయడానికి చిన్న నిర్మాతల నుంచి బడా ప్రొడ్యూసర్స్ వరకు సిద్ధంగా ఉన్నారు.

Update: 2025-02-02 16:37 GMT

గత ఏడాది ‘క’ మూవీతో కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నెక్స్ట్ ప్రాజెక్ట్స్ విషయంలో చాలా ప్లాన్డ్ గా వెళ్తున్నారు. ‘క’ కంటే ముందుగా కిరణ్ నటించిన ‘దిల్ రుబా’ మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది. ప్రేమకథతో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ మూవీతో మరో హిట్ ని తన ఖాతాలో వేసుకోవాలని కిరణ్ అబ్బవరం అనుకుంటున్నారు.

ఇదిలా ఉంటే ఈ కిరణ్ అబ్బవరం తో మూవీస్ చేయడానికి చిన్న నిర్మాతల నుంచి బడా ప్రొడ్యూసర్స్ వరకు సిద్ధంగా ఉన్నారు. అతనితో మినిమమ్ 15 నుంచి 20 కోట్ల బడ్జెట్స్ లో మూవీస్ ప్లాన్ చేస్తున్నారు. చాలా మంది ప్రొడ్యూసర్స్ ఇప్పటికే కిరణ్ కి అడ్వాన్స్ లు ఇచ్చి ఉన్నారని టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే కిరణ్ అబ్బవరం నెక్స్ట్ సినిమాకి సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది.

సందీప్ కిషన్ హీరోగా ‘మజాకా’ సినిమాతో చేస్తోన్న హాస్య మూవీస్ కిరణ్ తో కొత్త చిత్రాన్ని ఎనౌన్స్ చేసింది. దీనికి సంబందించిన ఒక పోస్టర్ ని రిలీజ్ చేశారు. హాస్య మూవీస్ ప్రొడక్షన్ నెంబర్ 7గా ఈ చిత్రం తెరక్కబోతోంది. ఈ మూవీ టైటిల్ రిలీజ్ తో పాటు పూజా కార్యక్రమం రామానాయుడు స్టూడియోస్ లో సోమవారం ఉదయం 8:15 గంటలని జరగబోతోందని కాన్సెప్ట్ పోస్టర్ లో తెలియజేసారు.

ఈ సినిమా క్యాస్టింగ్ అండ్ క్రూ గురించి కూడా మేగ్జిమమ్ సోమవారమే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ కాన్సెప్ట్ పోస్టర్ బ్యాక్ డ్రాప్ చూస్తుంటే ఇది కూడా విలేజ్ బ్యాక్ డ్రాప్ కథగానే ఉండబోతున్నట్లు కనిపిస్తోంది. మరి ఈ సినిమా కోసం కిరణ్ ఎలాంటి కథని ప్రేక్షకులకి చూపించబోతున్నాడనేది ఆసక్తికరంగా మారింది. కిరణ్ అబ్బవరం గత ఏడాది తన ప్రియురాలు రహస్య గోరఖ్ ని వివాహం చేసుకున్నాడు.

కొద్ది రోజుల క్రితం ఆమె గర్భవతిగా ఉన్నట్లు అఫిషియల్ గా ప్రకటించారు. అదే ఉత్సాహంలో కొత్త సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్లబోతున్నాడు. ‘క’ తర్వాత కిరణ్ అబ్బవరం స్టోరీ సెలక్షన్స్ పూర్తిగా మారిపోయిందనే మాట వినిపిస్తోంది. స్ట్రాంగ్ కథాబలం ఉన్న సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. కెరియర్ ని కూడా పర్ఫెక్ట్ గా బిల్డ్ చేసుకునే పనిలో పడ్డాడు. మరి నెక్స్ట్ సినిమాలు ఎలాంటి ఫలితాలను ఇస్తాయో చూడాలి.

Tags:    

Similar News