ఆయనతో సినిమా ఓ పీడ కలలా!
దేశంలో పేరున్న స్టార్ డైరెక్టర్లతో పనిచేయాలని ప్రతీ నిర్మాత కోరుకుంటాడు. అదో అచీవ్ మెంట్ గా భావిస్తుంటారు.
దేశంలో పేరున్న స్టార్ డైరెక్టర్లతో పనిచేయాలని ప్రతీ నిర్మాత కోరుకుంటాడు. అదో అచీవ్ మెంట్ గా భావిస్తుంటారు. అలాంటి స్టార్స్ తోనే పనిచేయాలని నిర్మాణ రంగంలోకి దిగేవారు ఎంతో మంది ఉంటారు. అందుకోసం ఎంతో కష్ట పడతారు. రూపాయి రూపాయి కూడబెట్టి కోట్లు సంపాదిస్తారు. చివరిగా తాను కోరుకున్న డైరెక్టర్ తో సినిమా చేసే స్థాయికి చేరుకుంటారు. అంతిమంగా ఓ రోజు అతడితో పనిచేసే ఆ గొప్ప అవకాశం వస్తుంది.
అటుపై ఆ నిర్మాత ఆనందానికి అవదులుండవ్. తన డ్రీమ్ పుల్ పిల్ అవుతుందంటూ ఎంతో సంతోషిస్తారు. సినిమా తర్వాత తన రేంజ్ మారిపోతుందని ఎన్నో అంచనాలు పెట్టుకుంటారు. ఏదో తెలియని శక్తి జనిస్తుంది. ఇండస్ట్రీలో తానేదో కొత్తగా సాధించాను అన్న అనుభూతికి గురవుతుంటారు. కానీ ఆ సినిమా ఫలితం తేడా కొడితే? అదే కల ఓ పిడ కలగానూ మిగిలిపోతుంది? అన్నది అనుభవం తర్వాత అర్దమైంది. తాజాగా టాలీవుడ్లో ఓ నిర్మాత ఈ మధ్య కాలంలో చేస్తోన్న వ్యాఖ్యలు చూస్తుంటే అదే అర్దమవుతుంది.
ఆ నిర్మాత ఆ స్టార్ డైరెక్టర్ తో సినిమా చేయాలని కొన్నేళ్లగా కలలు కన్నాడు. చివరిగా ఆ కలను నెరవేర్చుకున్నాడు. ఆ సినిమా రిలీజ్ కు ముందు ఆ ప్రాజెక్ట్ ని ఎంతగా ప్రేమించి పనిచేసాడు అన్నది ప్రతీ మాటలోనూ అర్దమైంది. ఆ సినిమా కోసం తన సంపదనంతా పళంగా పెట్టాడు. కానీ ఫలితం మాత్రం తీవ్ర నిరాశనే మిగిల్చింది. ఇలాంటి ఫలితం వస్తుందని తాను ఏమాత్రం ఊహించలేకపోయాడు. కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రికవరీ తేలేక పోయింది.
ఫలితం డిజాస్టర్ గా మారింది. దీంతో తాను కన్న ఆ కల ఓ పిడకలగా మారిపోయింది. చిత్ర పరిశ్రమలో రెండు దశాబ్దాలుగా నిర్మాతగా కొనసాగుతున్నాడు. ఎన్నో సినిమాలు నిర్మించాడు. తన జడ్జిమెంట్ తప్పింది కూడా చాలా తక్కువ సందర్భాల్లోనే. అందుకే నిర్మాతగా 20 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణాన్ని కొనసాగించ గలిగాడు. కానీ తన అను భవం...జడ్జిమెంట్ అన్నీ కూడా ఆ ఒక్క సినిమాలో 100 శాతం తప్పాయి అన్నది ఒప్పుకోవాల్సిన వాస్తవం. ఎవరా? నిర్మాత అన్నది మాత్రం సస్పెన్స్.