దర్శకుడితో తేడాలు.. విశాల్ ఏమన్నాడంటే..!
తుప్పరివాలన్ సీక్వెల్ తీస్తే అది సొంత బ్యానర్ లో తన డైరెక్షన్ లో చేస్తానని అన్నారు విశాల్.
విశాల్ హీరోగా ఆదిక్ డైరెక్షన్ లో వస్తున్న మార్క్ ఆంటోని సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. శుక్రవారం తమిళంలోనే కాదు సౌత్ అన్ని భాషల్లో మార్క్ ఆంటోని రిలీజ్ అవుతుంది. విశాల్ సినిమాలకు తెలుగులో కూడా మంచి డిమాండ్ ఉంటుంది. అయితే ఫలితాలతో సంబంధం లేకుండా తన ప్రతి సినిమాను విశాల్ తెలుగు ఆడియన్స్ ముందుకు తీసుకొస్తాడు. విశాల్ లేటెస్ట్ మూవీ మార్క్ ఆంటోని మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. సినిమా తప్పకుండా ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందని చెబుతున్నారు.
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా డైరెక్టర్ మిస్కిన్ తో తన గొడవ గురించి మరోసారి ప్రస్తావించారు విశాల్. మిస్కిన్ డైరెక్షన్ లో తుప్పరివాలన్ సినిమా చేశాడు విశాల్. తెలుగులో డిటెక్టివ్ గా రిలీజైన ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.
క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో సినిమా అంతా ఆసక్తికరంగా ఉంటుంది. ఆ సినిమా హిట్ అవడంతో సీక్వల్ తీయాలని అనుకున్నారు. సీక్వల్ కోసం కొంత భాగం షూటింగ్ కూడా చేశారు. అయితే మధ్యలో ఏమైందో ఏమో మిస్కిన్ తో వివాదమై విశాల్ సినిమాను ఆపేశారు.
తుప్పరివాలన్ సీక్వెల్ తీస్తే అది సొంత బ్యానర్ లో తన డైరెక్షన్ లో చేస్తానని అన్నారు విశాల్. మిస్కిన్ వల్ల లండన్ ఫ్లాట్ ఫార్మ్ మీద నరకం చూశానని అలాంటి వ్యక్తితో కలిసి చేసే ఉద్దేశం లేదని అన్నారు విశాల్. డిటెక్టివ్ 2 రెండేళ్లు పెండింగ్ లో పెట్టి షూటింగ్ మొత్తానికే ఆపేశారు.
అయితే ఆ సినిమా సీక్వెల్ తప్పకుండా ఉంటుందని అది తానే స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తానని అంటున్నారు విశాల్. మరోపక్క మిస్కిన్ మాత్రం విశాల్ తో గొడవ గురించి పెద్దగా పట్టించుకోలేదు. మళ్లీ తామిద్దరం కలిసి పనిచేస్తామని ఆమధ్య అన్నారు. కానీ విశాల్ మాత్రం మిస్కిన్ మీద అదే ఫైర్ మీద ఉన్నాడు.
ఈ మధ్య మిస్కిన్ నటుడిగా బిజీ అవడం వల్ల డైరెక్టర్ గా సినిమాలు లేట్ అవుతున్నాయి. విశాల్ మార్క్ ఆంటోని సినిమా ట్రైలర్ ఇంప్రెసివ్ గా ఉంది. సినిమా ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు సాధిస్తుందా లేదా అన్నది చూడాలి. ఈ సినిమా షూటింగ్ లో విశాల్ కు చాలా ప్రమాదాలు జరిగాయి. సినిమా కోసం అతను పడిన కష్టానికైనా సినిమా విజయం సాధించాలని కోరుతున్నారు చిత్ర యూనిట్.