వింత సమస్యతో నవ్వుతున్న లైలా
సౌత్ సినీ ఇండస్ట్రీలో తన అందం, అభినయంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ లైలా.;
సౌత్ సినీ ఇండస్ట్రీలో తన అందం, అభినయంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ లైలా. చొట్టబుగ్గల సుందరిగా తన నవ్వుతో ఆడియన్స్ మనసుల్ని గెలుచుకున్న లైలా కెరీర్లో ఎన్నో సక్సెస్‌లు అందుకుంది. మధ్యలో సినిమాలకు దూరమైన లైలా మళ్లీ 2022లో కార్తీ నటించిన సర్దార్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది.
ఆ తర్వాత దళపతి విజయ్ హీరోగా చేసిన ది గోట్ సినిమాలో కూడా కనిపించి మెప్పించింది. ఇప్పుడు తాజాగా ఆది పినిశెట్టి శబ్ధం సినిమాలో లైలా కీలకపాత్రలో కనిపించింది. శబ్ధం సినిమాకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో పాటూ లైలాకు కూడా మంచి ప్రశంసలొస్తున్నాయి. శబ్ధం ప్రమోషన్స్ లో భాగంగా లైలా తనకున్న ఓ వింత సమస్యను బయటపెట్టింది.
నవ్వకుండా ఉండటం తన వల్ల కాదని, అలా ఉంటే వెంటనే తనకు కళ్ల నుంచి నీళ్లొస్తాయని తెలిపింది. అయితే తన సమస్యను తెలుసుకున్న తమిళ హీరో విక్రమ్, శివపుత్రుడు షూటింగ్ టైమ్ లో నవ్వకుండా ఓ నిమిషం పాటూ ఉండాలని తనతో బెట్ వేశాడని, కానీ 30 సెకన్లలోనే తాను ఏడవడం మొదలుపెట్టానని, దాని వల్ల తన మేకప్ మొత్తం పాడైపోయిందని లైలా ఆ రోజుల్ని గుర్తు చేసుకుంది.
తనంతట తాను నవ్వు ఆపడానికి ఎప్పుడు ప్రయత్నించినా సరే ఆమెకు తెలియకుండానే కన్నీళ్లు వచ్చేస్తాయని, ఈ వింత ఆరోగ్య సమస్యతోనే తాను ఎప్పుడూ నవ్వుతూ ఉంటుందని లైలా వెల్లడించింది. లైలా సమస్య గురించి తెలుసుకున్న ఆమె ఫ్యాన్స్ ఇలాంటి సమస్యలు కూడా ఉంటాయా అని షాకవుతున్నారు.
ఇక లైలా కెరీర్ విషయానికొస్తే 1996 నుంచి 2006 వరకు తెలుగు, తమిళ భాషల్లో పలు సినిమాలు చేసిన ఆమె ఎన్నో సూపర్ హిట్లు అందుకుంది. 2006లో మెహ్దినీని పెళ్లి చేసుకుని పూర్తిగా సినిమాలకు దూరమైంది. లైలా భర్త ఇరాన్ కు చెందిన బిజినెస్ మ్యాన్ కాగా ఈ జంటకు ఇద్దరు అబ్బాయిలున్నారు.