తమ్ముడికి లేడీ గెటప్ వేసి చెల్లిలా ఫీలైన అనుపమ!
మాలీవుడ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ఆరంభంలో తడబడినా అటుపై తప్పిదాల్ని కవర్ చేసుకుని కెరీర్ ని జెట్ స్పీడ్ తో పరుగులు పెట్టిస్తోన్న సంగతి తెలిసిందే.
మాలీవుడ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ఆరంభంలో తడబడినా అటుపై తప్పిదాల్ని కవర్ చేసుకుని కెరీర్ ని జెట్ స్పీడ్ తో పరుగులు పెట్టిస్తోన్న సంగతి తెలిసిందే. గతేడాది నుంచి అమ్మడి వేగంగా మామూ లుగా లేదు. `రౌడీ బోయ్స్` విజయంతో అనుపమ రూట్ పూర్తిగా మార్చేసింది. అప్పటి నుంచి సక్సెస్ పాయింట్ ని పట్టుకుని కెరీర్ ని బిల్డ్ చేసుకుంటుంది. `కార్తికేయ-2` తో పాన్ ఇండియాలో సక్సెస్ అందుకుంది.
`బటర్ ప్లై` లాంటి లేడీ ఓరియేంటెడ్ సినిమా కూడా చేసింది. ప్రస్తుతం అమ్మడి చేతిలో మూడు..నాలుగు సినిమాలున్నాయి. ఇలా ఇంత బిజీ అవ్వడం వెనుక కారణం అమ్మడు తనలో రొమాంటిక్ యాంగిల్ ని తట్టిలేపడమే. ఆరంభంలో ముద్దు అంటే చేదుగా భావించిన సొసగరి అటుపై పెదవి ముద్దులతో సంలచలనమే అయింది. ఇంటిమేట్ సన్నివేశాలకు సైతం అనుపమ సై అంటుందని నిరూపించింది.
దీంతో అమ్మడి ఫేట్ మారిపోయింది. కెరీర్ పరంగా ఇంకొన్నాళ్ల పాటు ఎలాంటి ఢోకాలేదు. తాజాగా ఈ బ్యూటీ తన తమ్ముడి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు రివీల్ చేసింది. అక్షయ్ అనే ఓ తమ్ముడు ఉన్నాడు. కొత్త విషయాలు నేర్పించడంతో పాటు..వాటిని నాతోనూ పంచుకుంటాడు. ఏ విషయంలోనూ పొగడడు. కానీ విమర్శించడంలో ముందుంటాడు. అక్షయ్ విమర్శన వల్ల చాలా వరకూ నేను మారాను.
ఇద్దరి వయసు తేడా రెండేళ్లే. దీంతో వాడిని పెట్ లా ఫీలవుతుంటా. రకరకాల గెటప్స్ వేసి ఫోటోషూట్లు చేస్తుంటా. నేను అడిగిందల్లా చేసే అక్షయ్ కి అమ్మాయిగా గెటప్ వేసి చెల్లిగానూ మార్చుకుంటాను. ఆరకంగా చెల్లి లేని లోటును తీర్చుకుంటా. నేను ఏం చేసినా వాడు ఫీలవ్వడు. అక్క కోసం ఆ మాత్రం చేస్తానులే అంటాడు` అని అంది. ప్రస్తుతం అనుపమ తెలుగులో టిల్లు స్వ్యేర్ లో నటిస్తోంది. కొన్ని కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. అలాగే తమిళ్..మలయాళంలోనూ సినిమాలు చేస్తోంది.