ఫోటో స్టోరీ : ధం.. ధం.. దుమ్మురేపే అందం..!
బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటాని ఫోటో షూట్స్ కి ప్రత్యేకమైన క్రేజ్ ఉందని తెలిసిందే. అమ్మడు కాల్విన్ క్లైన్ బ్రాండ్ అంబాసిడర్ గా ఆ బ్రాండ్ తో పాటు తనకు సూపర్ క్రేజ్ వచ్చేలా చేసుకుంది
బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటాని ఫోటో షూట్స్ కి ప్రత్యేకమైన క్రేజ్ ఉందని తెలిసిందే. అమ్మడు కాల్విన్ క్లైన్ బ్రాండ్ అంబాసిడర్ గా ఆ బ్రాండ్ తో పాటు తనకు సూపర్ క్రేజ్ వచ్చేలా చేసుకుంది. లో దుస్తుల బ్రాండ్ కి పర్ఫెక్ట్ ప్రమోటర్ గా తనని తాను ఆడియన్స్ కు ఎంగేజ్ అయ్యేలా చేసుకున్న దిశా పటాని ఎప్పటికప్పుడు తన ఫోటోస్ తో అదరగొట్టేస్తుంది. ముఖ్యంగా అమ్మడు టూ పీస్ బికినీ వేసినా నిండుగా శారీ కట్టుకున్న రెండిటిలో కూడా తన స్టైల్ ఆఫ్ ఎక్స్ పోజింగ్ ని ఎక్కడ తగ్గించదు.
ఇక లేటెస్ట్ గా అమ్మడు శారీ లుక్ లో సర్ ప్రైజ్ చేసింది. కట్టింది శారీనే అయినా స్లీవ్ లెస్ జాకెట్ అది చూడటానికి ఇన్నర్ వేర్ (బ్రా)లుక్ ని కలిగి ఉంది. ఇక ఎద అందాల మీదే ఆడియన్స్ చూపు పడేలా అమ్మడి కొంగు చాటు అందాలు అదరహో అనిపిస్తున్నాయి. తనేం చేసినా అందులో సంథింగ్ స్పెషల్ అనేది ఉండాల్సిందే అనేలా ఫోటోషూట్స్ తో తన మార్క్ సెట్ చేస్తున్న దిశా పటాని శారీ లుక్ లో కూడా దుమ్ము దులిపేస్తుంది.
అందాల మధురిమలో దం దం దుమ్మురేపే అందం అనిపించేలా దిశా లుక్స్ ఉన్నాయి. లైట్ పింక్ శారీ దానికి తగినట్టుగానే జిగేలుమనిపించే స్లీవ్ లెస్ జాకెట్ ఒకసారి చూస్తే మళ్లీ మళ్లీ చూడాలనిపించే దిశా అందాలు ఫాలోవర్స్ ని నిద్ర పట్టనివ్వట్లేదని చెప్పొచ్చు. అమ్మడు సినిమాల లెక్క ఎలా ఉన్నా ఫోటో షూట్స్ తో మాత్ర విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పరచుకుంటుంది.
బాలీవుడ్ లో ఏ హీరోయిన్ కి లేని హాట్ ఇమేజ్ దిశా సొంతం చేసుకుంది. స్టార్ సినిమాలతో ఓ పక్క వెండితెర మీద అలరిస్తూనే ఫోటో షూట్స్ తో దిశాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తున్నాయి. దిశా లేటెస్ట్ డ్యాషింగ్ లుక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక అమ్మడి సినిమాల విషయానికి వస్తే దిశా పటాని ప్రభాస్ కల్కి 2898 ఏడి లో నటిస్తుంది. అంతకుముందు వరుణ్ తేజ్ లోఫర్ సినిమాలో కూడా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది దిశా. కల్కి తో మరోసారి తెలుగు ఆడియన్స్ ని పలుకరిస్తున్న దిశాకు ఇక్కడ మరిన్ని అవకాశాలు రావాలని ఆశిస్తున్నారు ఆమె ఫాలోవర్స్.