షాకింగ్: ముఖ్యమంత్రికి కంగన చీవాట్లు?
క్వీన్ కంగన ఇటీవల చంద్రముఖి 2 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఆ చిత్రం ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు.
క్వీన్ కంగన ఇటీవల చంద్రముఖి 2 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఆ చిత్రం ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. తలైవి తర్వాత సౌత్ లో కంగనకు మరో పరాభవం మిగిలింది. అయితే కంగన ఇప్పుడు పూర్తిగా తన తదుపరి సినిమాలపైనే దృష్టి సారించింది.
మరోవైపు క్వీన్ కాంట్రవర్శియల్ స్టేట్ మెంట్లు ఆగడం లేదు. తాజాగా తన సొంత రాష్ట్రం అయిన హిమచల్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని కంగన తీవ్రంగా నిందించింది. రాష్ట్ర విపత్తు నిధికి డబ్బును విరాళంగా ఇవ్వడానికి తాను చేసిన అనేక ప్రయత్నాలు విఫలమయ్యాయని కంగనా రనౌత్ హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. క్వీన్ సోషల్ మీడియాల్లో చెలరేగింది. తన విఫల ప్రయత్నాలకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌లను షేర్ చేసింది. పోస్ట్‌తో పాటు క్యాప్షన్‌లో ఇలా రాసింది.
``నేను నా ఫైనాన్స్ టీమ్ హిమాచల్ వరదల విపత్తు వేళ సాయంగా విరాళం ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాము. ప్రభుత్వ సహాయనిధి వెబ్ సైట్ లో 50-60 సార్లు ప్రయత్నించాం. ఈ రోజు నా బృందం కొంత మొత్తాన్ని మాత్రమే విరాళంగా ఇవ్వగలిగింది. అంతకు మించి వెబ్ పని చేయడం లేదు.. అని ఫిర్యాదు చేసింది. ఇది ప్రభుత్వానికి ఎంత అవమానం? అంటూ ఫైరైంది.
ఆగస్ట్ లో కంగనా రనౌత్ వరద బాధితులకు తన సంతాపాన్ని తెలియజేస్తూ రాష్ట్రంలోని పనికిమాలిన వ్యవస్థను హైలైట్ చేసింది. హిమాచల్ ప్రదేశ్‌లో ప్రజలు అరుదైన విపత్తును ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాలు, వరదలకు అంతం లేదు. పర్వతాలు జారిపోతున్నాయి. ప్రతిచోటా కూలిపోతున్నాయి. రోజుల తరబడి విద్యుత్ లేదు.. నీరు లేదు. మొత్తం వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. పర్వత (కొండ) ప్రజల కోసం.. వారి క్షేమం కోసం నేను నిరంతరం ప్రార్థిస్తున్నాను! అని కంగన అన్నారు.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. క్వీన్ కంగనా రనౌత్ `తేజస్`, ఎమర్జెన్సీ చిత్రాలతో అభిమానుల ముందుకు రానుంది. అలాగే బాలీవుడ్ లో వరుస చిత్రాల్లోను కంగన నటిస్తోంది. ఇటీవల విడుదలైన చంద్రముఖి 2 బాక్సాఫీస్ వద్ద అంతంత మాత్రంగా ఆడింది. అలాగే తేజస్‌లో కంగన ఫైటర్ పైలట్‌గా కనిపించనుంది. ఈ చిత్రానికి సర్వేష్ మేవారా దర్శకత్వం వహించారు. రోనీ స్క్రూవాలా నిర్మించారు. ఎమర్జెన్సీలో కంగనా రనౌత్ భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రను పోషిస్తోంది. నవంబర్ 24న ఈ సినిమా విడుదల కానుంది. నిర్మాతగా కంగన చివరి ప్రాజెక్ట్ టికు వెడ్స్ షేరు. ఇందులో నవాజుద్దీన్ సిద్ధిఖీ, అవ్నీత్ కౌర్ ప్రధాన పాత్రలు పోషించారు.