'బేబీ' వల్ల కిర్రాక్ సీతకి బెదిరింపులు

. సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో.. హీరోయిన్‌ వైష్ణవి ఫ్రెండ్‌ గా నటించిన కిర్రాక్ సీత గురించి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. వైష్ణవి చెడ్డ దారిలో నడవడానికి పూర్తి కారణం సీత అన్నట్లుగా చూపించారు.

Update: 2023-07-24 11:06 GMT

ఆనంద్ దేవరకొండ... వైష్ణవి చైతన్య ముఖ్య పాత్రల్లో రూపొందిన బేబీ సినిమా చిన్న సినిమాగా రిలీజ్ అయి పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. రూ.50 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా ఇంకా మంచి షేర్ ను రాబడుతూనే ఉంది. రెండవ వారంలో కూడా ఈ స్థాయి వసూళ్లు చూసి బాక్సాఫీస్ వర్గాల వారు కూడా అవాక్కవుతూ ఉంటారు.

ఇంతటి విజయాన్ని సొంతం చేసుకున్న బేబీ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు కూడా మంచి పేరును సొంతం చేసుకున్నారు. సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో.. హీరోయిన్‌ వైష్ణవి ఫ్రెండ్‌ గా నటించిన కిర్రాక్ సీత గురించి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. వైష్ణవి చెడ్డ దారిలో నడవడానికి పూర్తి కారణం సీత అన్నట్లుగా చూపించారు.

సినిమాలో చూపించినట్లుగానే నిజ జీవితంలో కిర్రాక్‌ సీత వ్యవహరిస్తుంది అంటూ సోషల్‌ మీడియాలో బండ బూతులు తిడుతున్నారట. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కిర్రాక్ సీత మాట్లాడుతూ.. తన గురించి అత్యంత నీచంగా దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. చెప్పడానికి కూడా సాధ్యం కాని భాష ని వాడుతూ బూతులు తిడుతున్నారు అంది.

తనను బెదిరిస్తున్నారు. నా అడ్రస్ కోసం కొందరు వెతుకుతున్నట్లుగా కూడా తెలిసింది. బేబీ సినిమా లో నేను పోషించిన పాత్రకు నా రియల్ లైఫ్ క్యారెక్టర్ కి ఎలాంటి సంబంధం లేదు. కొందరు నన్ను సినిమా లో చూసి తప్పుగా అర్థం చేసుకుని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు అంటూ ఆమె పేర్కొంది.

బేబీ సినిమా సక్సెస్‌ తో తన కెరీర్‌ కి మంచి బ్రేక్ దక్కినట్టుగా భావిస్తున్నట్లు పేర్కొంది. ముందు ముందు మరిన్ని మంచి పాత్రలు వస్తాయని ఆశిస్తున్నాను. అంతే కాకుండా లీడ్ రోల్స్ లో నటించే అవకాశం వస్తే తప్పకుండా నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కిర్రాక్ సీత పేర్కొంది.

Tags:    

Similar News