నీ వాలు కన్నుల్లో చిక్కుకునే హృదయాలెన్నో..!

టాలీవుడ్ లో హీరోయిన్స్ కొరత ఎప్పుడూ ఉండేదే అలాంటి టైంలో ఏ కొద్దిగా టాలెంట్ ఉన్నా సరే ఆ హీరోయిన్ కి అందలం ఎక్కించేస్తారు

Update: 2023-11-09 15:26 GMT

టాలీవుడ్ లో హీరోయిన్స్ కొరత ఎప్పుడూ ఉండేదే అలాంటి టైంలో ఏ కొద్దిగా టాలెంట్ ఉన్నా సరే ఆ హీరోయిన్ కి అందలం ఎక్కించేస్తారు. ఈ క్రమంలో ఈమధ్య కాలంలో వచ్చిన ఒక హీరోయిన్ తన టాలెంట్ తో వరుస ఛాన్స్ లు అందుకుంటుంది. కేవలం సినిమాలే కాదు సోషల్ మీడియాలో కూడా తన సత్త చాటుతుంది అమ్మడు. ఇంతకీ ఎవరా ముద్దుగుమ్మ అంటే ఇంకెవరు మీనాక్షి చౌదరి అని చెప్పాల్సిందే. సుశాంత్ సినిమా ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో తెరంగేట్రం చేసిన మీనాక్షి చిన్నగా ఒక్కో సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకుంటుంది.


టాలీవుడ్ లో ఐదారు సినిమాలు చేసిన హీరోయిన్స్ కూడా పాత పడిపోతుంటారు. అయితే కొందరికి మాత్రం దశాబ్దాల కాలం పాటు కెరీర్ రాసి పెట్టి ఉంటుంది. అయితే ఈ మధ్యలో ఎవరు కాస్త టాలెంట్ చూపించినా సరే వారికి అవకాశాలు వచ్చేస్తాయి. అలాంటి వారిలో మీనాక్షి చౌదరి ఉంది. యువ హీరోలతో నటిస్తూ వచ్చిన ఈ అమ్మడు స్టార్ హీరోలతో కూడా ఛాన్స్ అందుకుంది. సూపర్ స్టార్ మహేష్ గుంటూరు కారం లో అమ్మడు నటిస్తున్న విషయం తెలిసిందే.


వరుణ్ తేజ్ మట్కా సినిమాలో కూడా మీనాక్షి నటిస్తుంది. తెలుగుతో పాటు తమిళంలో కూడా సినిమాలు చేస్తున్న మీనాక్షి సోషల్ మీడియాలో కూడా రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉంటుంది. లేటెస్ట్ గా అమ్మడు తన ఫోటో షూట్ తో మరోసారి తన ఫాలోవర్స్ కి కిక్ ఇచ్చింది. రెగ్యులర్ ట్రెడిషనల్ గాగ్రానే వేసుకున్నా సరే తన చూపులతో కుర్రాళ్ల హృదయాలను గాయం చేస్తుంది అమ్మడు. ఓ పక్క సినిమాలు మరో పక్క ఈ ఫోటో షూట్స్ ఇవన్నీ కూడా మీనాక్షికి మంచి మైలేజ్ వచ్చేలా చేస్తున్నాయి.

ఇన్ స్టాలో తనని ఫాలో అయ్యే 1 మిలియన్ ఫాలోవర్స్ ని ఎప్పుడు డిజప్పాయింట్ చేయకుండా తన రెగ్యులర్ ఫోటో షూట్స్ తో అలరిస్తుంది మీనాక్షి. గుంటూరు కారం రిలీజ్ తర్వాత అమ్మడికి మరింత ఫాలోయింగ్ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం టాలీవుడ్ లో దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్న హీరోయిన్ గా మీనాక్షి క్రేజ్ తెచ్చుకుంది. ఆమె చేస్తున్న ఫోటో షూట్స్ కూడా ఇందుకు కారణమని చెప్పొచ్చు. పోటీ ఎంత ఉన్నా హీరోయిన్ గా తన సత్తా చాటాలని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిన మీనాక్షి అన్ని విధాలుగా ఆడియన్స్ లో క్రేజ్ తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో అమ్మడి పాపులారిటీ ఒక రేంజ్ లో ఉంది.

Tags:    

Similar News