మ‌లైకా ఏంటీ మ‌త్‌ల‌బ్‌? త‌ల‌లు ప‌ట్టుకుంటున్న‌ ఫ్యాన్స్‌!

మ‌లైకా తాజా ఇన్‌స్టా పోస్ట్ చాలా ప్ర‌శ్న‌ల‌ను మిగిల్చింది. ఈ పోస్ట్‌లో మూడు ఆప్షన్‌లు ఉన్నాయి. 1) ఇన్ ఎ రిలేషన్‌షిప్ 2) సింగిల్ 3) హేహే .. కానీ చివరి ఎంపికను హైలైట్ చేస్తూ టిక్ పెట్టింది మ‌లైకా.

Update: 2024-11-26 03:15 GMT

తాను ఒంటరిగా ఉన్నానని అర్జున్ కపూర్ వెల్లడించిన కొన్ని రోజుల తర్వాత మలైకా అరోరా చివరకు తన రిలేషన్ షిప్ స్టేటస్‌పై మౌనం వీడింది. ఏడేళ్లుగా రిలేషన్ షిప్‌లో ఉన్న అర్జున్ కపూర్ ఈ సంవత్సరం ప్రారంభంలో మ‌లైకా నుంచి విడిపోయాక‌ వార్తల్లో ఉన్నారు. అయితే మలైకా తాజా పోస్ట్ త‌న రిలేషన్ షిప్ స్టేటస్ గురించి అభిమానులు తలలు ప‌ట్టుకునేందుకు కార‌ణ‌మైంది.

 

ఈ ఏడాది ప్రారంభంలో మ‌లైకా నుంచి విడిపోయానని యువ‌హీరో అర్జున్ క‌పూర్ అధికారికంగా ధృవీకరించారు. తాను సింగిల్ గా ఉన్నాన‌ని అన్నారు. అయితే ఈ ప్ర‌క‌ట‌న త‌ర్వాత ఇప్ప‌టికి మ‌లైకా స్పందించింది. కానీ మ‌లైకా స్పంద‌న ఏమిటో అర్థం గాక అభిమానులు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు.

మ‌లైకా తాజా ఇన్‌స్టా పోస్ట్ చాలా ప్ర‌శ్న‌ల‌ను మిగిల్చింది. ఈ పోస్ట్‌లో మూడు ఆప్షన్‌లు ఉన్నాయి. 1) ఇన్ ఎ రిలేషన్‌షిప్ 2) సింగిల్ 3) హేహే .. కానీ చివరి ఎంపికను హైలైట్ చేస్తూ టిక్ పెట్టింది మ‌లైకా. దీనికి ఎలాంటి క్యాప్షన్‌ను జోడించకుండా రీషేర్ చేసింది. దీని అర్థం ఏమిటా? అంటూ అభిమానులు ప్ర‌స్తుతం త‌లలు గోక్కుంటున్నారు.

మలైకా అరోరా తన ప్రస్తుత రిలేషన్ షిప్ స్టేటస్‌పై ఇలా కన్ఫ్యూజ్ చేస్తోందేమిటీ? ఇంకా అర్జున్ పై ఆశ చావ‌లేదా? సయోధ్య కోసం ఆశప‌డుతోందా? అంటూ నెటిజ‌నులు ప్ర‌శ్నించారు. త‌మ మ‌ధ్య ప్రస్తుత సమీకరణం గురించి వారిద్దరూ బహిరంగంగా మాట్లాడక‌పోయినా కానీ త‌న‌లోని అంత‌ర్మ‌థ‌నాన్ని మ‌లైకా ఇలా బ‌య‌ట‌పెడుతోందా? అంటూ ఊహాగానాలు సాగిస్తున్నారు. ఈ జంట‌ కథలో ఇంకేమైనా ట్విస్టును ఊహించ‌వ‌చ్చా? దీనిని కేవలం సరదా పోస్ట్ అని అనుకోవాలా? అంటూ అభిమానులు సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు.

అర్జున్ కపూర్ ఇప్ప‌టికే తాను ఒంటరినని బహిరంగంగా ప్రకటించాడు. గత నెలలో ముంబయిలోని శివాజీ పార్క్‌లో రాజకీయ నాయకుడు రాజ్ థాకరే నిర్వహించిన దీపావళి పార్టీకి అర్జున్ హాజరయ్యారు. ప్రేక్షకులు మలైకా పేరును క‌ల‌వ‌రిస్తూ పదే పదే అరుస్తుండగా అర్జున్ తాను ఇప్పుడు ఒంటరిగా ఉన్నాను.. రిలాక్స్.. అంటూ వారిని స‌ముదాయించాడు.

ఈ జంట 2018లో డేటింగ్ ప్రారంభించారు.. 2024లో విడిపోయారు. ఈ సంవత్సరం సెప్టెంబరులో మలైకా తండ్రి మరణించినప్పుడు అర్జున్ త‌న వెంటే ఉన్నాడు. సోషల్ మీడియాలో ఈ జంట‌కు సంబంధించిన చాలా వీడియోలు, ఫోటోలు ఉన్నాయి. అర్జున్ మంచిత‌నాన్ని అంద‌రూ ప్ర‌శంసించారు.

Tags:    

Similar News