ఫోటో స్టోరి: గుండెల్లో గులాబి ముల్లు

కొంద‌రి అభిరుచి ఎలివేష‌న్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఫోటోగ్ర‌ఫీ జిమ్మిక్ కాదు.. ఫోటోగ్ర‌ఫీ కాన్సెప్ట్ చాలా కీల‌కం

Update: 2023-10-19 04:39 GMT

కొంద‌రి అభిరుచి ఎలివేష‌న్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఫోటోగ్ర‌ఫీ జిమ్మిక్ కాదు.. ఫోటోగ్ర‌ఫీ కాన్సెప్ట్ చాలా కీల‌కం. ఇదిగో ఇప్పుడు అలాంటి ఒక కాన్సెప్ట్ కుర్ర‌కారు గుండెల్లోకి స్ట్రైకింగ్ గా దూసుకెళుతోంది. ఇక్క‌డ అందాల భ‌రిణె షామా సికందర్ తన అద్భుతమైన అందం ఆకర్షణీయమైన ఒంపుసొంపుల‌ ప్రదర్శనతో మ‌తులు చెడ‌గొడుతోంది.


ఫోటోషూట్ల‌లో బోల్డ్ నెస్ త‌న‌కు కొత్తేమీ కాదు కానీ, ఈసారి మాత్రం అందుకు భిన్నంగా క‌ళాత్మ‌క మార్గాన్ని ఎంచుకుంద‌ని చెప్పాలి. ఆల్మోస్ట్ టాప్ లెస్‌గా క‌నిపించినా దానిని ఎంతో హుందాగానే ప్ర‌ద‌ర్శించింది. ఇదిగో ఇలా కొన్ని పింక్ గులాబీలు త‌న అందాల‌ను క‌వ‌ర‌ప్ చేస్తుండ‌గా, వైట్ బాట‌మ్ లో సంథింగ్ స్పెష‌ల్ గా క‌నిపించింది. గులాబీల‌తో పుష్ప‌గుచ్చం అమ్మ‌డి చేతికి చిక్కిన వైనం ఆస‌క్తిక‌రం. షామా శికంద‌ర్ అంటే చెల‌రేగిపోయే య‌వ్వ‌న‌శిరి. కానీ ఇప్పుడు షూట్ ఎట్ హార్ట్ స్కిల్ తో మ‌రోసారి త‌న‌లోని క్రియేటివిటీని వెలుగులోకి తెచ్చింది.

సోష‌ల్ మీడియాల్లో వ‌రుస ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తూ భారీగా అభిమానులను సంపాదించుకున్న బాలీవుడ్ నటి షామాలో ఏది అత్యంత ఆక‌ర్ష‌ణ క‌లిగినది? అని ప్ర‌శ్నిస్తే.. ఆ గిరజాల జుట్టు అని చెప్పాలి. షామా ఓవ‌రాల్ లుక్ మంత్రముగ్ధులను చేస్తుంది. ''ఇన్న‌ర్ లో ధైర్యంగా ఆలింగనం చేసుకోండి'' అంటూ బోల్డ్ కామెంట్ ని దీనికి జోడించింది.

ఈ ఏడాదితో షామా సికందర్ కు 40 ఏళ్లు. టీవీ షో యే మేరీ లైఫ్ హై (2003-2005)లో పూజా మెహతా పాత్రలో న‌టిగా పాపుల‌రైంది. అమీర్ ఖాన్ 'మన్ అండ్ ప్రేమ్ అగ్గన్' లలో కూడా కనిపించింది. ప‌లు బాలీవుడ్ సినిమాల్లోనూ కనిపించింది. షార్ట్ ఫిల్మ్ 'సెక్సాహోలిక్'.. 'మాయా: స్లేవ్ ఆఫ్ హర్ డిజైర్స్'తో దుమారం రేపింది. షామా నిర్మాత గానూ మారింది. షామా సికందర్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో తన సొంత సంస్థలో సినిమాలు చేస్తోంది. ఇందులో షామా మానసిక ఆరోగ్యం గురించి 'అబ్ దిల్ కి సన్' అనే షార్ట్ మూవీ సిరీస్ ను నిర్మించింది.

Tags:    

Similar News