నెంబర్లను అసలు పట్టించుకోను!
హార్ట్ ఎటాక్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన అదా శర్మ తర్వాత సెకండ్ హీరోయిన్ గా పలు సినిమాలు చేసింది.;

సక్సెస్ ఫెయిల్యూర్ మాత్రమే కాదు, సినీ ఇండస్ట్రీలో రాణించాలంటే లక్ కూడా కావాలి. అదృష్టం లేనప్పుడు వరుస హిట్స్ అందుకున్నా వారి కెరీర్ ముందుకు సాగదు. హీరోయిన్లు కూడా వరుస సక్సెస్ లు లేదా కొంత ఫేమ్ వచ్చాక అప్పటివరకు ఉన్న ఇండస్ట్రీని వదిలేసి వేరే ఇండస్ట్రీకి వెళ్లి అక్కడ తమ సత్తా చాటాలనుకుంటారు.
అలా టాలీవుడ్ నుంచి ఎంతోమంది బాలీవుడ్ కు వెళ్లి అక్కడ కలిసిరాక అవకాశాల కోసం ఎదురుచూస్తుంటారు. హార్ట్ ఎటాక్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన అదా శర్మ తర్వాత సెకండ్ హీరోయిన్ గా పలు సినిమాలు చేసింది. ఆ తర్వాత బాలీవుడ్ కు వెళ్లి అక్కడ ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టింది. ది కేరళ స్టోరీ సినిమాతో బాలీవుడ్ లో మంచి హిట్ అందుకుంది అదా.
గతేడాది ది కేరళ స్టోరీ డైరెక్టర్ తోనే కలిసి బస్తర్: ది నక్సల్ స్టోరీ లో నటించింది అదా శర్మ. కానీ ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయింది. రీసెంట్ గా బస్తర్ మూవీ ఫ్లాప్ పై అదా స్పందించింది. ఏ సినిమా అయినా ఆడియన్స్ నుంచి సరైన ఆదరణ పొందలేదంటే దానికెన్నో కారణాలుంటాయని ఆమె అన్నారు.
తన వరకు తాను ఒక మంచి సినిమా చేస్తున్నానా లేదా అనేది మాత్రమే చూస్తానని, తనకు వచ్చిన పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేస్తానని అదా శర్మ అన్నారు. తానెప్పుడూ బాక్సాఫీస్ నెంబర్లపై దృష్టిపెట్టలేదని, అలా దానిపై ఫోకస్ చేస్తే యాక్టింగ్ సరిగా చేయలేనని, ది కేరళ స్టోరీ చేస్తున్నప్పుడు అది అంత పెద్ద హిట్ అవుతుందని అనుకోలేదని, ఆ సినిమా లేడీ ఓరియెంటెడ్ మూవీ అయినప్పటికీ భారీ వసూళ్లు రాబట్టిందని అదా తెలిపారు. బస్తర్ సినిమా విషయంలో కూడా తాను బాక్సాఫీస్ ను దృష్టిలో పెట్టుకుని ఆ సినిమా చేయలేదని తన పాత్ర ఎలా చేస్తున్నాను అనేదే ఆలోచించి చేశానని అదా శర్మా అన్నారు.