‘అదిదా సర్‌ప్రైజ్’ గొడవ.. తప్పించుకోకుండా నితిన్ పర్ఫెక్ట్ రిప్లై!

అలాగే సాంగ్ నచ్చిన వాళ్ళు రీల్స్ చేస్తుండటంతో సోషల్ మీడియాలో ఈ పాట మార్మోగిపోతోంది. ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఓవరాల్‌గా ఇండస్ట్రీలోనూ ‘అదిదా సర్‌ప్రైజ్’ పాటపై చర్చ మొదలైంది.;

Update: 2025-03-21 17:30 GMT

టాలీవుడ్‌లో ప్రస్తుతం హాట్ ట్రెండ్‌గా మారిన పాట ‘అదిదా సర్‌ప్రైజ్’ (Adhi Dha Surprisu). నితిన్, శ్రీలీల జంటగా నటిస్తున్న ‘రాబిన్‌హుడ్’లోని ఈ సాంగ్ రిలీజ్ అయినప్పటి నుంచి నెట్టింట్లో విపరీతమైన గోల క్రియేట్ చేసింది. మ్యూజిక్, కొరియోగ్రఫీ, క్యాచీ లిరిక్స్ అన్నీ కలిసి ఈ పాటను ట్రెండ్ అయ్యేలా చేశాయి. అలాగే సాంగ్ నచ్చిన వాళ్ళు రీల్స్ చేస్తుండటంతో సోషల్ మీడియాలో ఈ పాట మార్మోగిపోతోంది. ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఓవరాల్‌గా ఇండస్ట్రీలోనూ ‘అదిదా సర్‌ప్రైజ్’ పాటపై చర్చ మొదలైంది.

ఇటీవల మహిళా కమిషన్ కూడా కాస్త సీరియస్ కాగా హుక్ స్టెప్పును మార్చే ఆలోచనలో ఉన్నట్లు టాక్. లేటెస్ట్ గా, ఈ పాటపై వస్తున్న డిబేట్‌కు హీరో నితిన్ క్లారిటీ ఇచ్చాడు.. 'నిజానికి ఈ సాంగ్ లో నేను.. సినిమా అంతా బాగా వచ్చింది. అదే ఫీల్ తో దాన్ని చూసి పెద్దగా పట్టించుకోలేదు. ఈ పాట విడుదలైన దగ్గరినుంచి చాలా మంది ఎంజాయ్ చేస్తున్నారు. అయితే కొన్ని విమర్శలు వినిపిస్తున్నాయి. అందరి అభిప్రాయాలను మేము గౌరవిస్తాం.

స్కిన్ షో లేకుండా కూడా మంచి ఎనర్జీతో డిజైన్ చేసిన పాట ఇది. కొందరు దీనిపై తప్పుగా అభిప్రాయపడుతున్నారు. కానీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ పాటకు చాలా మంది.. ముఖ్యంగా అమ్మాయిల గెటప్ వేసుకుని రీల్స్ చేస్తున్నారు. ఇది ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం చేసిన పాట. ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తే అదే మా విజయంగా భావిస్తాం.. అని నితిన్ అన్నాడు. సాధారణంగా ఇలాంటి విషయాలపై ఎలా స్పందించాలి అనేది అంతగా క్లారిటీ ఉండదు. ఒకవైపు సినిమా, మరోవైపు కాంట్రవర్సీ. అయితే నితిన్ స్పందించిన విధానం మెచ్చుకోదగినది.

కాంట్రవర్సీని పక్కన పడేయలేదు, అలాగని సినిమా ప్రమోషన్ కు ఇబ్బంది కలిగేలా తక్కువ చేసి మాట్లాడలేదు. విమర్శలను కూడా యాక్సెప్ట్ చేసేలా మాట్లాడిన తీరుపై నెటిజన్లు పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఇలాంటి ప్రశ్నలను దాటి వేసేలా జాగ్రత్తలు తీసుకునే వారు చాలామంది ఉన్నారు. కానీ నితిన్ అలా వెనక్కి తగ్గలేదు. కొన్ని స్టెప్పులపై విమర్శలు వచ్చినప్పటికీ, వాటిని పెద్దగా పట్టించుకోకుండా యూనిట్ ప్రమోషన్స్‌ను ముందుకు తీసుకెళ్తోంది.

దర్శకుడు వెంకీ కుడుముల ఈ సినిమాను ఓ ఫన్ రైడ్‌గా మలచాడని చెబుతున్నారు. నితిన్, శ్రీలీల కెమిస్ట్రీ ఈ సినిమాలో హైలైట్ కానుందని చిత్ర బృందం వెల్లడించింది. మ్యూజిక్ విషయానికినికి వస్తే, ఈ పాటను ఎనర్జిటిక్ బీట్స్‌తో జీవి ప్రకాష్ కుమార్ కంపోజ్ చేయగా, శేఖర్ మాస్టర్ డ్యాన్స్ మూమెంట్స్‌ను డిజైన్ చేశారు.

‘రాబిన్‌హుడ్’ సినిమా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవి శంకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రముఖ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కీలక పాత్రలో నటిస్తుండటంతో అంచనాలు మరింత పెరిగాయి. వార్నర్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైన తర్వాత, తెలుగు ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగింది. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా, కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేసింది.

Tags:    

Similar News