ఆయ‌న మాట‌ల మ‌నిషి కాదు చేత‌ల మ‌నిషి!

స‌ల్మాన్ ఖాన్ క‌థానాయ‌కుడిగా ముర‌గ‌దాస్ దర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన `సికింద‌ర్` ఈద్ సంద‌ర్భంగా రెండు రోజుల ముందుగానే మార్చి 28న రిలీజ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే.;

Update: 2025-03-21 21:45 GMT
ఆయ‌న మాట‌ల మ‌నిషి కాదు చేత‌ల మ‌నిషి!

స‌ల్మాన్ ఖాన్ క‌థానాయ‌కుడిగా ముర‌గ‌దాస్ దర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన `సికింద‌ర్` ఈద్ సంద‌ర్భంగా రెండు రోజుల ముందుగానే మార్చి 28న రిలీజ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈద్ కి భాయ్ సినిమాలు రిలీజ్ అవ్వ‌డం అన్న‌ది పెద్ద సెంటిమెంట్ గా భావిస్తాడు. ప్ర‌తీ ఈద్ కి ఓ సినిమా రిలీజ్ కు ఉండేలా ప్లాన్ చేసుకుని బ‌రిలోకి దిగ‌డం భాయ్ కి అల‌వాటు. ఆ సంద‌ర్భంగా రిలీజ్ అయిన చాలా చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద మంచి ఫ‌లితాలు సాధించాయి.

అయితే `సికింద‌ర్` విష‌యంలో పెద్ద‌గా బ‌జ్ మొద‌టి నుంచి క‌నిపించ‌లేదు. ముర‌గ‌దాస్ ప్లాప్ ల్లో ఉండ‌టం...స‌ల్మాన్ ఖాన్ కూడా హిట్ కు దూరంగా క‌నిపించ‌డంతో బ‌జ్ లోపించింది. `సికింద‌ర్` ప్ర‌చార చిత్రాల‌తోనైనా బ‌జ్ క్రియేట్ అవుతుంద‌నుకుంటే? అదీ జ‌ర‌గ‌లేదు. టీజ‌ర్, ట్రైల‌ర్ ఇత‌ర ప్ర‌చార చిత్రాలేవి సినిమా భారీ హైప్ తీసుకు రావ‌డంలో స‌హ‌క‌రించ‌లేదు. ముర‌గ‌దాస్ వైఫ‌ల్యాల కార‌ణంగా ఈ ప‌రిస్థితి ఎదుర‌వుతుంద‌న్నది ఓ కార‌ణం. అయితే ఇక్క‌డో విష‌యం గుర్తించాలి.

ముర‌గ‌దాస్ మాట‌ల మ‌నిషి కాదు. చేత‌ల మ‌నిషి. ఆయ‌న కంటెంట్ స‌క్సెస్ అయిందంటే? ఇండ‌స్ట్రీ రికార్డులే తుడిచి పెట్టుకుపోతాయి. `గ‌జినీ`, `తుపాకీ`, ` క‌త్తి`,` స‌ర్కార్` లాంటి సినిమాలు ఎలాంటి ఫ‌లితాలు సాధించాయో చెప్పాల్సిన ప‌నిలేదు. యాక్ష‌న్ స‌న్నివేశాల్లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త ఉంది. వరుస వైఫ‌ల్యాల నేప‌థ్యంలో `సికింద‌ర్` లో మ‌ళ్లీ అలాంటి మ్యాజిక్ రిపీట్ అవుతుంద‌ని ఆయ‌న అభిమానులు ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. ఈ సినిమా స‌క్సెస్ కూడా ముర‌గ‌దాస్ కి కీల‌క‌మే.

ప్ర‌స్తుతం పాన్ ఇండియా రేస్ లో టాలీవుడ్ దూసుకుపోతున్న నేప‌థ్యంలో? ఇత‌ర భాష‌ల హీరోలు కూడా తెలుగు ప‌రిశ్ర‌మ వైపు చూస్తున్నారు. సుకుమార్, రాజ‌మౌళి లాంటి వారితో ప‌నిచేయాల‌ని ఆస‌క్తి చూపు తున్నారు. ఆ లిస్ట్ లో ముర‌గ‌దాస్ చేరాలంటే? తన మార్క్ సినిమాల‌తోనే అది సాధ్య‌మ‌వుతుంది.

Tags:    

Similar News