ధ‌నుష్‌-నాగార్జునల‌తో శేఖ‌ర్ క‌మ్ములా అందుకే!

`కుభేర` ధ‌నుష్‌, నాగార్జున‌తో చేయ‌డానికి కార‌ణం అదేన‌న్నారు. ఈ సినిమా తీసినందుకు గ‌ర్వ‌ప‌డుతున్నా.;

Update: 2025-03-23 06:03 GMT

శేఖ‌ర్ క‌మ్ములా చిత్రాలంటే అందులో భారీ తార‌గ‌ణ‌మంటూ ఉండ‌దు. క‌థ‌కు ఆధారంగా న‌టీన‌టుల్ని తీసుకుని చేస్తుంటారు. క‌థ‌...అందులో పాత్ర‌లు బ‌లంగా ఉండాలి త‌ప్ప కాంబినేష‌న్లు కాద‌న్న‌ది ఆయ‌న అభిప్రాయం. అందుకే శేఖ‌ర్ క‌మ్ములా ఇప్ప‌టివ‌ర‌కూ చేసిన లైనప్ చూస్తే? చాలా మంది కొత్త వాళ్లు.. మీడియం రేంజ్ న‌టీన‌టులే క‌నిపిస్తుంటారు.

అయితే తొలిసారి కమ్ములా తొలిసారి త‌న ఫార్ములాను ప‌క్క‌న‌బెట్టి `కుభేర` చిత్రాన్ని చేస్తున్నారు. ఇందులో ధ‌నుష్ హీరోగా న‌టిస్తుండ‌గా, కింగ్ నాగార్జున ఓ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ఇది ముంబై గ్యాంగ్ స్టార్ బ్యాక్ డ్రాప్ స్టోరీ అంటున్నారు. ఇలాంటి స్టోరీల జోలికి క‌మ్ములా ఇంత‌వ‌ర‌కూ వెళ్లింది లేదు. తొలిసారి ఆయ‌న‌లో సెన్సిబిలిటీస్ ని కూడా ప‌క్క‌న‌బెట్టి చేస్తున్నాడు. మ‌రి ఎప్పుడు స్టార్స్ జోలికి వెళ్ల‌ని క‌మ్ములా ఇప్పుడే ఎందుకిలా? అంటే..

`కొత్త‌గా ఏదో చెప్పాల‌ని చూస్తుంటా. ముందుగా క‌థ రాసుకుని..ఆ త‌ర్వాత వాటిని ఎవ‌రితో తీస్తే బాగుంటుందో వాళ్ల‌ని సంప్ర‌దిస్తుంటా. కాంబినేష‌న్లు సెట్ చేసి సినిమాలు తీయ‌డం స‌రైంది కాద‌ని చెప్ప‌ను. వాళ్ల‌కు త‌గ్గ‌ట్టు ఓ ప్ర‌పంచం సృష్టించుకుని సినిమాలు తీయ‌డం అన్న‌ది కొంద‌రికి బ‌లం. ప్ర‌స్తుతం సినిమా తీయ‌డం అన్న‌ది చాలా ఖరీదుగా మారిపోయింది. ఆ డ‌బ్బును తిరిగ‌తి రాబ‌ట్టాలంటే కాంబినేష‌న్లు కావాల్సిందేన‌న్నారు.

`కుభేర` ధ‌నుష్‌, నాగార్జున‌తో చేయ‌డానికి కార‌ణం అదేన‌న్నారు. ఈ సినిమా తీసినందుకు గ‌ర్వ‌ప‌డుతున్నా. సినిమా చూసిన ప్రేక్ష‌కులు వావ్ అంటారని ధీమా వ్య‌క్తం చేసారు. ఈ సినిమాపై క‌మ్ములా ఎంత కాన్పిడెంట్ గా ఉన్నారో? ఆయ‌న మాట‌ల్ని బ‌ట్టి తెలిసిపోతుంది. ఇంత‌వ‌ర‌కూ ఏ సినిమా విష‌యంలో ఆయ‌న ఇంత ఓపెన్ గా మాట్లాడింది లేదు. దీంతో కుభేర పై అంచ‌నాలు రెట్టింపు అవ్వ‌డం ఖాయం.

Tags:    

Similar News