షాప్ ఓపెనింగ్ కు వచ్చిన బాలీవుడ్ నటికి చేదు అనుభవం!

ఒక షాకింగ్ ఉదంతం వెలుగు చూసింది. బాలీవుడ్ కు చెందిన ఒక టీవీ నటి హైదరాబాద్ నగరానికి వచ్చిన సందర్భంగా ఆమె దాడికి గురి కావటం.. లక్కీగా పోలీసుల సాయంతో బయటపడిన వైనం ఆలస్యంగా బయటకు వచ్చింది.;

Update: 2025-03-24 04:10 GMT

ఒక షాకింగ్ ఉదంతం వెలుగు చూసింది. బాలీవుడ్ కు చెందిన ఒక టీవీ నటి హైదరాబాద్ నగరానికి వచ్చిన సందర్భంగా ఆమె దాడికి గురి కావటం.. లక్కీగా పోలీసుల సాయంతో బయటపడిన వైనం ఆలస్యంగా బయటకు వచ్చింది. ముంబయికి చెందిన ఒక టీవీ నటిని హైదరాబాద్ లోని ఒక షాప్ ఓపెనింగ్ కోసం రావాలంటూ ఒక స్నేహితురాలు ఆహ్వానించింది.

ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నందుకు ఫ్లైట్ ఛార్జీలతో పాటు రెమ్యునరేషన్ కూడా ఇస్తామని చెప్పటంతో ఆమె ఈ నెల 18న హైదరాబాద్ కు వచ్చింది. ఆమెకు బస ఏర్పాటు మాసబ్ ట్యాంక్ శ్యామ్ నగర్ కాలనీలోని అపార్ట్ మెంట్ లో కల్పించారు. అక్కడే ఒక పెద్ద వయస్కురాలు నటికి అవసరమైన వసతుల్ని ఏర్పాటు చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఆ తర్వాత ఆమెకు చేదు అనుభవాలు వరుసగా ఎదురయ్యాయి.

ఈ నెల 21న రాత్రి తొమ్మిది గంటల వేళలో ఇద్దరు మహిళలు.. నటి ఉన్నఅపార్టుమెంట్ లోకి వెళ్లి తమతో కలిసి వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేయగా.. ఆమె తిరస్కరించారు. రాత్రి పదకొండు గంటల వేళలో ముగ్గురు పురుషులు నటి ఉన్న గదిలోకి వచ్చి.. తమతో గడపాలని ఒత్తిడికి గురి చేశారు. ఎదురు తిరిగిన ఆమెపై దాడికి పాల్పడ్డారు.

బాధితురాలు గట్టిగా అరచి పోలీసులకు కంప్లైంట్ చేస్తానని చెప్పటంతో భయపడిన వారు అక్కడి నుంచి పారిపోయారు. ఇదిలా ఉండగా.. ముందుగా ఇంటికి వచ్చిన ఇద్దరు మహిళలు.. పెద్ద వయస్కురాలు.. నటిని బంధించి.. ఆమె దగ్గర ఉన్న రూ.50వేల మొత్తాన్ని తీసుకొని పారిపోయారు. దీంతో బాధితురాలు డయల్ 100కు ఫోన్ చేయటం.. పోలీసులు తక్షణమే స్పందించి ఆమె ఉన్న ప్రాంతానికి వెళ్లారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా చేసుకొని కేసు నమోదు చేసిన వారు.. ఇప్పుడు విచారణ జరుపుతున్నారు.

Tags:    

Similar News