ది ఫ్యామిలీమ్యాన్ 3.. ఇంకా ప్రమాదకరమైన మిషన్
ప్రైమ్ వీడియో హిట్ సిరీస్ `ది ఫ్యామిలీమ్యాన్` మూడవ సీజన్ రాక కోసం అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు.;
ప్రైమ్ వీడియో హిట్ సిరీస్ `ది ఫ్యామిలీమ్యాన్` మూడవ సీజన్ రాక కోసం అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. తొలి రెండు సీజన్లు అద్భుతమైన ఆదరణ దక్కించుకోగా, ఈ సిరీస్ కొనసాగింపు కథలపై ఉత్కంఠ నెలకొంది. మనోజ్ బజ్‌పేయీ శ్రీకాంత్ తివారీగా తిరిగి నటిస్తున్నాడు. గత సీజన్లు అద్భుతమైన కథాంశాలు ఊహించని మలుపులతో రక్తి కట్టించాయి. భారతదేశంలో అత్యంత ఇష్టపడే గూఢచారి థ్రిల్లర్లలో ఇది ఒకటిగా నిలిచింది. సీజన్ 2 ముగింపు గొప్ప ఉత్కంఠను పెంచింది. ఈ ముగింపు కచ్ఛితంగా పార్ట్ 3లో మరింత ప్రమాదకరమైన మిషన్‌ను సూచించింది. ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 కోసం జనంలో ఉత్కంఠకు కారణాలున్నాయి.
శ్రీకాంత్ కుమార్తె ధ్రితి కిడ్నాప్ కి గురయ్యాక.., తన తండ్రికి పరీక్ష పెడుతుంది. త్రిధి పాత్ర తో ముడిపడిన ఘటనలను తెరపై యూత్ చూస్తారు. ఈ సంఘటన తివారీ మానసిక ప్రభావాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. మేజర్ సమీర్ భారతదేశానికి వ్యతిరేకంగా టెర్రర్ ఎటాక్ లను ప్లాన్ చేస్తూనే ఉన్నాడు. అతని మనుగడ ఎన్ ఐఏకు తీవ్రమైన పని కల్పిస్తుంది.
మనోజ్ బజ్‌పేయి -జైదీప్ అహ్లావత్ ఫేస్-ఆఫ్ ఉత్కంఠను పెంచేదే. జైదీప్ అహ్లావత్ ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 లో విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సిరీస్‌కు ఎగ్జయిట్ మెంట్ పెంచే పాత్ర ఇతడిది. ఇద్దరు పవర్‌హౌస్ ప్రదర్శనకారులు జైదీప్ అహ్లావత్ - మనోజ్ బజ్‌పేయీల మధ్య ఘర్షణను చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తీవ్రవాదం నేపథ్యంలో ఈ సిరీస్ ఇప్పటికే ప్రజల హృదయాలను గెలుచుకుంది.