వీడియో: బాపు బొమ్మలా.. భన్సాలీ కళాకారిణిలా..
చూపులు తిప్పుకోనివ్వని ట్రీట్ ఇది..! తనదైన అందం అరుదైన అభినయ కళతో కట్టి పడేస్తున్న ఈ నవయువ నాయిక ఎవరు? నటిగా తన ఉన్నతిని చేరుకునేందుకు ఎప్పుడూ ప్రయత్నం ఆపదు;
చూపులు తిప్పుకోనివ్వని ట్రీట్ ఇది..! తనదైన అందం అరుదైన అభినయ కళతో కట్టి పడేస్తున్న ఈ నవయువ నాయిక ఎవరు? నటిగా తన ఉన్నతిని చేరుకునేందుకు ఎప్పుడూ ప్రయత్నం ఆపదు. ఒక్కో మెట్టు ఎక్కేందుకు తపన పడుతూనే ఉంది... చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తోంది. అదే సమయంలో తనను తాను నిర్మాతగా ప్రమోట్ చేసుకుంటోంది. టాలీవుడ్ లో 24 శాఖలపై గ్రిప్ పెంచుకుంటున్న అరుదైన నటి ఎవరో ప్రత్యేకించి చెప్పాలా? ఫ్యాన్స్ సులువుగా గెస్ చేయగలరు. ది గ్రేట్ మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల గురించే ఇదంతా.
తాజాగా విడుదలైన నిహారిక స్పెషల్ డ్యాన్స్ వీడియో చూడగానే, అభిమానుల మనసులపై ఘాడమైన ముద్ర వేసింది. అందం ఆకర్షణ మాత్రమే కాదు అభినయంలోను నిహారిక మెరుపులు మెరిపిస్తోంది. చూడగానే బాపు బొమ్మలా.. భన్సాలీ సినిమాలో కళాకారిణిలా ఎంత అందంగా కనిపిస్తోంది? ఒకప్పుడు భానుప్రియ, శ్రీదేవి, జయప్రద కళ్లతో కోటి భావాలు పలికించేవారు. ముఖాభినయంతో మైమరిపించేవారు. తమ కట్టు బొట్టు నటనలో ట్రెడిషన్ కనిపించేది. ఇటీవలి కాలంలో అలాంటి పనితనం నాయికల్లో కనిపించడం లేదనే విమర్శలు ఉన్నాయి. కానీ ఇప్పుడు నిహారిక అలాంటి ఒక కొత్త ప్రయత్నం చేస్తోందా? మేటి తారల నుంచి నేర్చుకుని నవతరం నటీమణుల్లో ఉత్తమంగా కెరీర్ ఎదుగుదలకు ప్లాన్ చేస్తోందా? అన్నది వేచి చూడాలి. అంబటి భార్గవి, యోగ్ కిషన్ ఈ పాట నృత్యాలు, యాంబియెన్స్ కోసం వర్క్ చేసారని నిహారిక ఇన్ స్టాలో వెల్లడించింది. నిహారిక కొరియోగ్రఫీ శైలి ఎంతో ఆకట్టుకుంది.
మరోవైపు నిహారిక నిర్మాతగాను షైన్ అవుతోంది. కమిటీ కుర్రోళ్లు సినిమా అద్భుతమైన విజయం సాధించిన తర్వాత పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ లో నిర్మాతగా తన రెండవ సినిమాని అధికారికంగా ధృవీకరించింది. ఇంకా పేరు పెట్టని ఈ సినిమాకి మానస శర్మ దర్శకత్వం వహిస్తారు. మానస శర్మ గతంలో జీ5 కోసం `ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ` అనే వెబ్ సిరీస్‌కు క్రియేటివ్ డైరెక్టర్‌గా పనిచేశారు. బెంచ్ లైఫ్ (సోనీ లివ్) కి దర్శకత్వం వహించారు. ఇప్పుడు నిహారిక బ్యానర్‌లో తొలిసారి ఒక సినిమాకి దర్శకత్వం వహిస్తోంది. ఈ సినిమా తారాగణం, సాంకేతి నిపుణుల గురించి ఇంకా వివరాలు వెల్లడించాల్సి ఉంది.