భార్య వల్ల రోజంతా తాగుతూ దేవదాస్ అయ్యాను: అగ్ర హీరో
రాత్రి పూట నిదుర పట్టలేదు. అస్సలు తాగుడు అలవాటు లేని నేను ఒక రోజులో మొత్తం బాటిల్ తాగే వ్యక్తిగా మారాను.;
అసాధారణ స్టార్‌డమ్.. ప్రపంచవ్యాప్త ఖ్యాతి ఒకవైపు.. వ్యక్తిగత కుటుంబ సమస్యలు మరోవైపు స్టార్ల జీవితాల్లో కనిపిస్తున్నాయి. అంతులేని అభిమానం ఒకవైపు.. అంతూ దరీలేని ఆవేదన మరోవైపు స్టార్లను వేధించడం రొటీన్ గా మారింది.
బాలీవుడ్ ప్రముఖ హీరో అమీర్ ఖాన్ ఇద్దరు భార్యలకు విడాకులిచ్చి, ఇప్పుడు మూడో పెళ్లికి సిద్ధమవ్వడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇటీవలే తన ప్రియురాలు గౌరీని మీడియాకు పరిచయం చేసారు ఆయన. అయితే తాజా చాటింగ్ సెషన్ లో అమీర్ ఖాన్ తన మొదటి భార్య రీనా దత్తాకు విడాకులిచ్చాక ఎంతగా దుఃఖించాడో బయటపడ్డాడు. అతడు రోజంతా మందు బాటిల్ తో గడిపానని, మద్యానికి బానిసయ్యానని వెల్లడించారు. ఆ సమయంలో తాను తీవ్ర నిరాశలో కూరుకుపోయానని తెలిపారు. ఆమీర్ ఖాన్ - రీనా దత్తా పదహారు సంవత్సరాల సంసారం కుప్పకూలింది. 2002లో విడాకులు తీసుకున్నప్పటికి జునైద్ ఖాన్, ఇరా ఖాన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తాను మొదటి బ్రేకప్ తర్వాత పని మానేసి మద్యానికి బానిసయ్యానని తెలిపారు.
మూడేళ్ల పాటు దుఃఖంలో మునిగిపోయానని.... స్క్రిప్టులు వినలేదని పని పూర్తిగా ఎగ్గొట్టానని అమీర్ ఖాన్ బహిరంగంగా చెప్పారు. ఇంట్లో ఒంటరిగా ఉన్నాను.. దాదాపు ఒకటిన్నర సంవత్సరాలు బాగా తాగాను. రాత్రి పూట నిదుర పట్టలేదు. అస్సలు తాగుడు అలవాటు లేని నేను ఒక రోజులో మొత్తం బాటిల్ తాగే వ్యక్తిగా మారాను. నేను దేవదాస్ నయ్యాను. తనను తాను నాశనం చేసుకోవడానికి ప్రయత్నించేవాడిగా మారాను.. అని చెప్పారు
''ఒకప్పుడు నీది ఇప్పుడు లేదని అంగీకరించు. అది ఉన్నప్పుడు అది నీకు ఎంత మంచిదో, అది లేనప్పుడు నువ్వు ఎంత మిస్ అవుతావో కూడా అంగీకరించు!'' అని ఫిలాసఫికల్ గా మాట్లాడాడు. 2005లో తన అసిస్టెంట్ కిరణ్ రావును అమీర్ ఖాన్ రెండవ వివాహం చేసుకున్నారు. ఈ జంట 2011లో సరోగసీలో కుమారుడు ఆజాద్ రావు ఖాన్‌ను స్వాగతించారు. 2021లో విడిపోయారు. ఇటీవల అమీర్ తన 60వ పుట్టినరోజు వేడుకలో తన స్నేహితురాలు గౌరీ స్ప్రాట్‌ను పరిచయం చేశాడు. 18 నెలలుగా ఆమెతో డేటింగ్‌లో ఉన్నానని తెలిపాడు. తదుపరి సితారే జమీన్ పర్‌లో అమీర్ కనిపిస్తాడు. ఈ చిత్రం 2025 వేసవిలో థియేటర్లలోకి వస్తుంది.