ప్రభాస్ ఇంటి భోజనంలో ఆ రెసిపీ చాలా ఇష్టం
స్వతహాగా భోజనప్రియుడైన ప్రభాస్, తన కో యాక్టర్లకు కూడా భోజనం పంపిస్తూ తమ మర్యాదలను తెలియచేస్తూ ఉంటాడు.;
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఎంత సింపుల్ గా ఉంటాడో తన ఇంటికి అతిథులెవరైనా వస్తే వారికి అతిథి మర్యాదలు చేసి వారిని భోజనంతోనే చంపేస్తాడు. స్వతహాగా భోజనప్రియుడైన ప్రభాస్, తన కో యాక్టర్లకు కూడా భోజనం పంపిస్తూ తమ మర్యాదలను తెలియచేస్తూ ఉంటాడు. ప్రభాస్‌కే కాదు, ఆయన ఇంటి భోజనానికి కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.
ప్రభాస్ తో సలార్ లో నటించిన పృథ్వీరాజ్ సుకుమారన్ తాజాగా ప్రభాస్ ఇంటి భోజనం గురించి మాట్లాడారు. మోహన్ లాల్ హీరోగా ఆయన దర్శకత్వంలో వస్తోన్న ఎల్2: ఎంపురాన్ ప్రమోషన్స్ సినిమా మార్చి 27న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ లో చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేయగా అందులో పృథ్వీరాజ్ మాట్లాడారు.
ప్రభాస్ ఇంటి నుంచి తనకు కొన్ని స్పెషల్ వంటలు వచ్చేవని, అవన్నీ అద్భుతంగా ఉంటాయని, ప్రభాస్ పంపిన మటన్ అంటే తనకు చాలా ఇష్టమని, మటన్ తో చేసిన వంటకం టేస్ట్ తనకు బాగా నచ్చిందని ఈ సందర్భంగా పృథ్వీరాజ్ తెలిపారు. ప్రభాస్ గెస్టులను గౌరవించే తీరు ఎంతో గొప్పగా ఉంటుందని కూడా ఆయన ప్రభాస్ ను పొగిడారు.
పృథ్వీరాజ్ చేసిన కామెంట్స్ ను ప్రభాస్ ఫ్యాన్స్ నెట్టింట తెగ షేర్ చేస్తూ ఆయన దర్శకత్వం వహించిన ఎల్2: ఎంపురాన్ హిట్ అవాలని ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. లూసిఫర్ సినిమాలానే ఎల్2 కూడా భారీ హిట్ అవుతుందని చిత్ర యూనిట్ ఎంతో ధీమా వ్యక్తం చేస్తుంది. సలార్ సినిమాలో వరదరాజ మన్నార్ పాత్రలో నటించిన పృథ్వీరాజ్ కు ప్రభాస్ అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆయనంత మంచి వాడిని తానెప్పుడూ చూడలేదని గతంలోనే చాలాసార్లు చెప్పగా, ఇప్పుడు ప్రభాస్ ఇంటి భోజనం గురించి ఆయన మరోసారి మాట్లాడారు.