ధనుష్ తో తల అజిత్ నిర్మాత ఏమన్నారంటే!
ఈ ప్రాజెక్ట్ చర్చలు ఇంకా ప్రారంభ దశలో ఉన్నాయి. ఇంకా ఫైనల్ కాలేదు. ఆ సినిమా గురించి ఇప్పుడే మాట్లాడటం అన్నది తొందరపాటు అవుతుంది.;
ఇటీవలే స్టార్ హీరో కం డైరెక్టర్ ధనుష్ దర్శకత్వంలో తల అజిత్ హీరోగా ఓ సినిమా చేస్తున్నాడనే ప్రచారం మొదలైన సంగతి తెలిసిందే. ఇద్దరు ఓ భారీ చిత్రానికి సన్నాహాలు చేస్తున్నట్లు కోలీవుడ్ మీడియాలో కథనాలు అంతకంతకు వెడెక్కించాయి. తాజాగా ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మరిన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. 'ఇడ్లీ కడై' చిత్రాన్ని నిర్మిస్తోన్న డాన్ పిక్చర్స్‌కు చెందిన ఆకాష్ భాస్కరన్ ఈ కాంబినేషన్ గురించి రివీల్ చేసారు.
ఈ ప్రాజెక్ట్ చర్చలు ఇంకా ప్రారంభ దశలో ఉన్నాయి. ఇంకా ఫైనల్ కాలేదు. ఆ సినిమా గురించి ఇప్పుడే మాట్లాడటం అన్నది తొందరపాటు అవుతుంది. అందుకే ఏ విషయాలు ఇప్పుడే చెప్పడం లేదు. ప్రాజెక్ట్ ఒకే అయితే అధికారికంగా అన్ని వివరాలు వెల్లడిస్తాం' అన్నారు. దీంతో అజిత్-ధనుష్ కాంబినేషన్ లో సినిమా పక్కా అని తేలిపోయింది. నిజంగా ఇంట్రెస్టింగ్ కాంబినేషన్. ధనుష్ దర్శకుడిగా కెరీర్ ఈ మధ్యనే ప్రారంభించాడు.
డైరెక్టర్ గా చేసిన 'పా పాండి', 'రాయన్' సినిమాలు తెరకెక్కించాడు. ప్రస్తుతం 'ఇడ్లీ కడై', ' నిలవాక్కు ఎన్ మెల్ ఎన్నడి కోబమ్' ఆన్ సెట్స్లో ఉన్నాయి. రెండు సినిమాలపై మంచి అంచనాలున్నాయి. ఇంతలోనే అజిత్ ఛాన్స్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం అజిత్ కూడా మునుపటిలా యాక్టివ్ గా సినిమాలు చేయడం లేదు. కార్ రేసింగ్ పై ఉన్న ఆసక్తి ఆయనకు సినిమాలపై కనిపించలేదని కొన్ని హింట్స్ తో అర్దమైంది.
కోలీవుడ్ మీడియా ఈ విషయాన్ని ఎంతో ఓపెన్ గానూ షేర్ చేసుకుంది. అలాంటి సమయంలో ధనుష్ కి ఛాన్స్ ఇచ్చారంటే? ఇద్దరు కొత్తగా ఏదో ప్లాన్ చేస్తున్నట్లే కనిపిస్తుంది. ప్రస్తుతం ధనుష్ హీరోగానూ కొన్ని సినిమాలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన బిజీ షెడ్యూల్ నుంచి పూర్తిగా ఖాళీ అయిన తర్వాత అజిత్ ప్రాజెక్ట్ పై సీరియస్ గా పనిచేసే అవకాశం ఉంది.