కీరవాణి నెవర్ బిఫోర్ అన్నాడంటే..?
సూపర్ స్టార్ మహేష్ రాజమౌళి కాంబినేషన్ సినిమా గురించి ఎన్నో రకాల ఊహాగానాలు మొదలయ్యాయి.;
సూపర్ స్టార్ మహేష్ రాజమౌళి కాంబినేషన్ సినిమా గురించి ఎన్నో రకాల ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ సినిమా మొదలవడం ఆలస్యం సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో హంగామా మొదలైంది. ఐతే రాజమౌళి ఓ పక్క సైలెంట్ గా షూట్ చేసుకుంటూ వెళ్తున్నాడు. రాజమౌళి మహేష్ సినిమా ఇంత స్పీడ్ గా షూటింగ్ జరుపుకోవడం ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి అందరు ఒక రేంజ్ అంచనాలతో చెబుతుండగా సినిమాకు మ్యూజిక్ అందిస్తున్న కీరవాణి వాటిని పెంచేలా కామెంట్స్ చేశారు.
ఎస్.ఎస్.ఎం.బి 29 సినిమాపై ఇదివరకు ఎప్పుడు ఇలాంటి మూవీ రాలేదు అన్నట్టుగా కీరవాణి చెప్పుకొచ్చారు. అంతేకాదు ఈ సినిమా కోసం ఎన్నో సవాళ్లను స్వీకరించాల్సి ఉందని కీరవాణి కామెంట్ చేశారు. రాజమౌళి కీరవాణి కాంబో గురించి ఎంత చెప్పినా తక్కువే. ముఖ్యంగా జక్కన్న సినిమాకు కీరవాణి అందించే మ్యూజిక్ ప్రాణంగా నిలుస్తుంది. ఈ ఇద్దరు పర్ఫెక్ట్ సింక్ లో తమ ప్రతి సినిమాకు ది బెస్ట్ ఇస్తున్నారు.
ఇక మహేష్ సినిమాకు కూడా కీరవాణి నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్ అందిస్తున్నారని తెలుస్తుంది. ఓ పక్క సినిమా షూటింగ్ జరుపుకుంటుండగా మరోపక్క కీరవాణి సినిమాలో సాంగ్స్, బిజిఎం మీద వర్క్ చేస్తున్నట్టు తెలుస్తుంది. రాజమౌళి తెర మీద్ అద్భుతాలు చూపిస్తే.. వెనక తన డ్యూటీ తను పర్ఫెక్ట్ గా చేస్తాడు కీరవాణి.
ఇక శనివారం ఆయన మ్యూజిక్ కాన్సర్ట్ ఒకటి జరుగుతుంది. ఈసారి చాలా భారీగా ఈ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. తన కెరీర్ లో 800 పైగా సాంగ్స్ అందించిన కీరవాణి మెలోడీ మ్యూజిక్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మారారు. కీరవాణి మ్యూజిక్ కాన్సర్ట్ కోసం భారీ ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తుంది.
మహేష్ రాజమౌళి కాంబో సినిమాలో కీరవాణి పాత్ర కూడా చాలా ఉంటుందని తెలిసిందే. సినిమాలో ప్రియాంక చోప్రా ఫిమేల్ లీడ్ గా నటిస్తుండగా ప్రతి నాయకుడిగా పృధ్విరాజ్ సుకుమారన్ నటిస్తున్నాడని తెలుస్తుంది. మరి ఎస్.ఎస్.ఎం.బి 29 సినిమా విషయంలో కీరవాణి ఇంతకుముందు ఇలాంటిది జరగలేదు అని చెప్పగానే సూపర్ స్టార్ ఫ్యాన్స్ సూపర్ ఖుషి అవుతున్నారు. రాజమౌళి సినిమా కోసం మహేష్ తన మేకోవర్ చేసుకున్న విషయం తెలిసిందే. ఈమధ్యనే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో ఫారిన్ షెడ్యూల్ కి రెడీ అవుతున్నారని తెలుస్తుంది.