ఎల్లమ్మగా ఎవరు ఫిట్..?

బలగం లాంటి రూట్స్ లోకి వెళ్లి సినిమా చేసిన వేణు యెల్దండి ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.;

Update: 2025-03-21 15:43 GMT

బలగం లాంటి రూట్స్ లోకి వెళ్లి సినిమా చేసిన వేణు యెల్దండి ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. కమెడియన్ గా మాత్రమే ఆడియన్స్ కు పరిచయం ఉన్న వేణు డైరెక్ట్ గా మారి ఇచ్చిన షాక్ మైండ్ బ్లాక్ అయ్యింది. బలగం సినిమా తర్వాత వేణు తన సెకండ్ సినిమా ఎల్లమ్మ అనే ప్రాజెక్ట్ తో వస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో నితిన్ హీరోగా లాక్ అయ్యాడని తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ విషయంలో ఇంకా ఒక క్లారిటీ రాలేదు.

సాయి పల్లవిని తీసుకోవాలనే ప్రయత్నాలు జరుగుతున్నా ఆమె డేట్స్ అడ్జెస్ట్ అవ్వట్లేదని తెలుస్తుంది. ఇంతకీ సాయి పల్లవి కాకుంటే ఎల్లమ్మ టైటిల్ రోల్ పోషించే ఛాన్స్ ఎవరికి ఉంది ఆ అవకాశాన్ని ఎవరు అందుకుంటారన్న డిస్కషన్ మొదలైంది. ఎల్లమ్మ సినిమాలో హీరోయిన్ పాత్రకు చాలా వెయిట్ ఉంటుందని తెలుస్తుంది. ఆ పాత్రలో నటించాలంటే అది మామూలు వాళ్లకు సాధ్యం కాదు.

సాయి పల్లవి కాకపోతే ఆ ప్లేస్ లో కీర్తి సురేష్ ఆప్షన్ లో ఉంటుంది. ఎందుకంటే మహానటితో ఆమె ఆల్రెడీ ప్రూవ్ చేసుకుంది కాబట్టి ఆమె చేసినా అదే రేంజ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఐతే కీర్తి కాకుంటే రష్మిక మందన్నా కూడా చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. రష్మిక కి స్కోప్ ఉన్న పాత్ర ఇస్తే ఆమె న్యాయం చేయగలదని చాలా సినిమాలు ప్రూవ్ అయ్యాయి.

కీర్తి సురేష్, రష్మిక కాకపోతే సమంత ని కూడా పరిగణనలోకి తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఐతే సమంత తెలుగు సినిమాల మీద ఆసక్తి చూపించట్లేదన్న టాక్ ఉంది కాబట్టి ఆమెను అప్రోచ్ అవుతారా లేదా అన్నది తెలియదు. ఇక అనుష్క ఇప్పుడు ఎల్లమ్మగా చేసే ఛాన్స్ లేదు. ఇక నితిన్ తో ఆల్రెడీ రెండు సినిమాలు తీసి హిట్ అందుకుంది కాబట్టి ఫాం లో లేకపోయినా నిత్యా మీనన్ ని ఏమైనా తీసుకొస్తారా అంటే చెప్పడం కష్టమని అంటున్నారు.

సో ఎల్లమ్మ పాత్రకు ఎవరు ఫిట్ అవుతారు.. ఫైనల్ గా సినిమాలో ఎవరిని ఎంపిక చేస్తారన్నది చూడాలి. రీసెంట్ గా ఎల్లమ్మ లో తాను ఎంత పర్ఫార్మ్ చేస్తే అంత పేరొస్తుందని అన్నాడు. సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ అనేశాడు నితిన్. సో ఎల్లమ్మ కథ మీద నితిన్ అంత కాన్ ఫిడెంట్ గా ఉన్నాడు కాబట్టి హీరోయిన్ గా ఎవరు చేసినా వాళ్లకి సూపర్ క్రేజ్ వస్తుందని చెప్పొచ్చు.

Tags:    

Similar News