నితిన్.. శ్రీలీల.. ఫన్నీ పాడ్ కాస్ట్..!

లవర్ బోయ్ నితిన్ వెంకీ కుడుముల కాంబినేషన్ లో వస్తున్న రాబిన్ హుడ్ సినిమా మార్చి 28న రిలీజ్ కాబోతుంది.;

Update: 2025-03-21 14:52 GMT

లవర్ బోయ్ నితిన్ వెంకీ కుడుముల కాంబినేషన్ లో వస్తున్న రాబిన్ హుడ్ సినిమా మార్చి 28న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ ని డిఫరెంట్ గా ప్లాన్ చేస్తూ ఆడియన్స్ ని అలరిస్తున్నారు చిత్ర యూనిట్. ఇప్పటికే హీరో నితిన్, డైరెక్టర్ వెంకీ కుడుముల కలిసి చేసిన హానెస్ట్ పాడ్ కాస్ట్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. సినిమాల్లో ఇలా ఎందుకు జరుగుతాయని డైరెక్టర్ హీరోని అడిగితే నితిన్ హానెస్ట్ ఆన్సర్స్ ఫన్నీగా అనిపించాయి.

ఇక ఇదే క్రమంలో నితిన్ శ్రీలీల మధ్య ఇలాంటి ఒక హానెస్ట్ పాడ్ కాస్ట్ జరిగింది. మీరు ఎందుకు ప్రతి సినిమాలో రిచ్ అమ్మాయిగా నటిస్తారు.. హీరోయిన్ లు ఎందుకు ఫైట్ జరగ్గానే హీరోతో లవ్ లో పడతారు. హీరోయిన్స్ వస్తుంటే వర్షం, పూలు ఎందుకు పడతాయి. హీరోయిన్స్ అంతా కూడా బ్యాడ్ బోస్ నే ఇష్టపడతారు ఎందుకు లాంటి ప్రశ్నలు అడీగితే వాటికి శ్రీలీల కూడా హానెస్ట్ సమాధానం చెప్పింది.

హీరోలు ఫైట్ చేస్తుంటే హీరోలు లవ్ లో పడితే వెంటనే సాంగ్ వేసుకుంటారని చెప్పింది శ్రీలీల. హీరోయిన్స్ కోసం హీరోలే కాదు పూలు, వర్షాలు కూడా పడతాయని అన్నది. కోల్డ్ లొకేషన్స్ లో కేవలం శారీ మీద ఎందుకంటే మహిళ అంటే అబల కాదు సభల అని నిరూపించుకునేందుకు అని అంటుంది. హీరోయిన్లు బ్యాడ్ బోయ్స్ ని ఎందుకు ఇష్టపడతారు అంటే బోయ్స్ అంటేనే బ్యాడ్ అందులో గుడ్ బ్యాడ్ ఏముంది అని ఆన్సర్ ఇచ్చింది.

ఇలా నితిన్, శ్రీలీల మధ్య జరిగిన ఈ హానెస్ట్ ఫన్నీ పాడ్ కాస్ట్ ప్రేక్షకులను అలరిస్తుంది. మార్చి 28న రిలీజ్ కాబోతున్న రాబిన్ హుడ్ సినిమా విషయంలో మేకర్స్ చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు. ఆల్రెడీ డైరెక్టర్ చేసిన రెండు సినిమాలు హిట్లే కాబట్టి నితిన్ రాబిన్ హుడ్ తో కూడా సక్సెస్ ఇస్తాడేమో చూడాలి.

ఈమధ్య సినిమాలు చేయడం కాదు వాటిని చూసేలా ప్రేక్షకులను ప్రిపేర్ చేయాలని కొన్ని సినిమాల ప్రమోషన్స్ చూసి ఇప్పుడు అందరు కూడా అదే దారిలో వెళ్తున్నారు. రాబోతున్న రాబిన్ హుడ్ సినిమా కోసం హీరో, డైరెక్టర్ మంచి ప్రమోషనల్ కంటెంట్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ ప్రమోషన్స్ వల్ల సినిమాకు మంచి బజ్ క్రియేట్ అవుతుంది. ఇక రాబిన్ హుడ్ ట్రైలర్ అసలైతే నేడు రిలీజ్ చేయాల్సి ఉన్నా 23న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

Full View
Tags:    

Similar News