చాహల్ (X) ధనశ్రీ: ఒకరిపై ఒకరు అలా కత్తులు నూరారు
కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ- క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ జంట ప్రేమవివాహం బ్రేకప్ అవ్వడం దేశవ్యాప్తంగా అభిమానుల్లో చర్చగా మారింది.;
కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ- క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ జంట ప్రేమవివాహం బ్రేకప్ అవ్వడం దేశవ్యాప్తంగా అభిమానుల్లో చర్చగా మారింది. ఈ బ్రేకప్ ని ఎవరూ జీర్ణించుకోలేదు. అయితే ఈ జంట 2022 నుంచి విడివిడిగా ఉంటున్నారని కథనం రావడం నిజంగా షాకింగ్. ఆ ఇద్దరికీ మధ్య సింక్ కుదరలేదు.. దీంతో గొడవలొచ్చాయి. విడాకుల ప్రక్రియలో భాగంగా చాహల్ తన భార్య ధనశ్రీకి భరణం కూడా చెల్లించారని కథనాలొచ్చాయి. బాంబే హైకోర్టు విడాకులు మంజూరు చేసిన కొన్ని గంటల తర్వాత తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ధనశ్రీ వర్మ మొదటి పోస్ట్‌ను షేర్ చేసింది.
బ్రేకప్ తర్వాత తన మొదటి పోస్ట్‌లో ధనశ్రీ తన కొత్త పాట `దేఖా జీ దేఖా మైనే`ను ప్రమోట్ చేసింది. ఈ పాట కాన్సెప్ట్ ప్రస్తుత తన జీవితంలో నిజఘటనలను ప్రతిబింబించింది. టైమింగ్ లీ వివాహేతర సంబంధాల గురించి, చితికిపోయిన బంధం గురించి తెరపై ఆవిష్కరించింది. ఈ వీడియోలో ఇష్వాక్ సింగ్ లీడ్ పాత్రలో నటించాడు. అయితే తన భర్త గృహహింసకు పాల్పడిన విధానాన్ని, వివాహేతర సంబంధాలను కొనసాగించే భర్తతో కలతలను కూడా చూపించారు. బంధంలో మోసాన్ని ఈ పాటలో హైలైట్ చేసారు.
ధనశ్రీ వర్మ ఒక ఇండివిడ్యువాలిటీ ఉన్న విమెన్. సంపాదకురాలు అయి ఉండి కూడా భర్తను భరణం అడగడంపై సెటైర్ వేస్తూ ... ``మీకు మీరు సుగర్ డాడీగా ఉండండి`` అనే ట్యాగ్ లైన్ ఉన్న టీషర్టుతో చాహల్ కోర్టు ప్రాంగణంలో అడుగు పెట్టారు. వస్తుంటారు.. పోతుంటారు! అనే ట్యాగ్ తో చాహల్ స్నేహితుడు బ్లాక్ టీషర్ట్ ధరించి అతడితో కనిపించాడు. ఇది ధనశ్రీకి కౌంటర్ అని అందరికీ అర్థమైంది.
చాహల్ - ధనశ్రీ డిసెంబర్ 2020లో వివాహం చేసుకున్నారు. జాతీయ మీడియా కథనాల ప్రకారం.. జూన్ 2022లో విడిపోయారు. ఫిబ్రవరి 5న వారు పరస్పర అంగీకారంతో విడాకులు కోరుతూ ఫ్యామిలీ కోర్టులో ఉమ్మడి పిటిషన్ దాఖలు చేశారు. చాహల్ - విజయ్ వర్మ రెండున్నర సంవత్సరాలకు పైగా విడివిడిగా జీవిస్తున్నారని, భరణానికి సంబంధించి రెండు పార్టీల మధ్య మధ్యవర్తిత్వం కుదిరిందని హైకోర్టు గుర్తించింది. చివరకు విడాకులు మంజూరయ్యాయి.