రాబిన్‌హుడ్ కు బన్నీ సినిమాతో పోలికా..?
ప్రమోషన్స్ లో భాగంగానే పలు ఈవెంట్లు, పాడ్‌కాస్ట్ లు, ఇంటర్వ్యూలు, మాల్ విజిట్స్, కాలేజ్ ఈవెంట్లు ఇలా దేన్నీ వదలడం లేదు.;
నితిన్ హీరోగా నటించిన రాబిన్‌హుడ్ సినిమా మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. సినిమాను ప్రమోట్ చేయడానికి దొరికిన ఏ ఛాన్స్ ను చిత్ర యూనిట్ వదులుకోవడం లేదు. హీరో నితిన్ దగ్గర నుంచి డైరెక్టర్ వెంకీ కుడుముల, హీరోయిన్ శ్రీలీల, నిర్మాత రవి శంకర్ అందరూ అన్ని ఏరియాలు తిరిగి రాబిన్‌హుడ్ ను ప్రమోట్ చేస్తున్నారు.
ప్రమోషన్స్ లో భాగంగానే పలు ఈవెంట్లు, పాడ్‌కాస్ట్ లు, ఇంటర్వ్యూలు, మాల్ విజిట్స్, కాలేజ్ ఈవెంట్లు ఇలా దేన్నీ వదలడం లేదు. రాబిన్‌హుడ్ తప్పకుండా విజయం సాధిస్తుందని చిత్ర యూనిట్ మొత్తం ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నారు. కంటెంట్ పై నమ్మకంతోనే డైరెక్టర్ వెంకీ కుడుముల వైజాగ్ ఏరియా రైట్స్ ను కొని సినిమాను రిలీజ్ చేస్తున్నాడు.
ఇదిలా ఉంటే నితిన్ తన రాబిన్‌హుడ్ సినిమాను అల్లు అర్జున్ నటించిన జులాయి సినిమాతో పోలుస్తున్నాడు. రాబిన్‌హుడ్ ఎలా ఉంటుందనేది చెప్పాలంటే అల్లు అర్జున్ నటించిన జులాయి సినిమాలా ఉంటుందని చెప్పాడు. ఆ సినిమాలో హీరో, విలన్ మధ్య ఎలాంటి మైండ్ గేమ్స్ ఉంటాయో, ఆ సినిమాలో ఎలాంటి కామెడీ ఉంటుందో రాబిన్‌హుడ్ కూడా అలానే ఉంటుందని చెప్పాడు.
రాబిన్‌హుడ్ లో తనకు, దేవదత్త నాగేకు మధ్య ఆడియన్స్ ఎగ్జైట్ అయ్యే మైండ్ గేమ్స్ ఎన్నో ఉంటాయని, ఆ ఎగ్జైట్‌మెంట్ అందరినీ కట్టిపడేస్తుందని నితిన్ చెప్పాడు. జులాయి సినిమా తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు రాబిన్‌హుడ్ లో ఫుల్ లెంగ్త్ రోల్ చేశారని, ఆ సినిమాలో అల్లు అర్జున్, రాజేంద్ర ప్రసాద్ మధ్య వచ్చే కాంబినేషన్ సీన్స్ ను ఆడియన్స్ ఎలా ఎంజాయ్ చేశారో, ఈ మూవీలోని రాజేంద్ర ప్రసాద్ సీన్స్ ను చూసి కూడా అంతే ఎంటర్టైన్ అవుతారని, ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఈ విషయంలో అందరికీ ఓ క్లారిటీ వస్తుందని నితిన్ తెలిపాడు.
మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా, ఈ సినిమాలో అదిదా సర్‌ప్రైజు అనే స్పెషల్ సాంగ్ లో హీరోయిన్ కేతిక శర్మ డ్యాన్స్ చేసింది. రాబిన్‌హుడ్ లో ఆస్ట్రేలియన్ స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఓ స్పెషల్ క్యామియో చేసిన సంగతి తెలిసిందే. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఆయనే చీఫ్ గెస్టుగా వచ్చే అవకాశముంది.