న్యూ స్టైల్ లో సామ్ స్టన్నింగ్ లుక్.. మైండ్ బ్లోయింగ్ అనాల్సిందే..
సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్ హీరోయిన్స్ ఉన్నా కూడా కొందరి పేర్లు చిరస్థాయిగా నిలిచేలా ఉంటాయి.;
సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్ హీరోయిన్స్ ఉన్నా కూడా కొందరి పేర్లు చిరస్థాయిగా నిలిచేలా ఉంటాయి. అలాంటి మంచి గుర్తింపు అందుకున్న వారిలో సమంత రూత్ ప్రభు కూడా టాప్.లిస్టులో ఉంటుందని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో అమ్మడు కాస్త సినిమాలు తగ్గించినా కూడా తన గ్లామర్ తో మాత్రం ఎప్పటికప్పుడు సరికొత్తగా కనిపిస్తూనే ఉంది. తెలుగుతో పాటు తమిళ పరిశ్రమలోనూ సమంతకు మంచి మార్కెట్ ఉంది. ఇటీవల కొంత గ్యాప్ తీసుకున్నా.. మళ్లీ కొత్త ప్రాజెక్ట్స్‌తో అభిమానుల ముందుకు రానుంది.
సినిమాల్లో మాత్రమే కాకుండా, సమంత సోషల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తోంది. ప్రతి ఫోటోషూట్‌లోనూ కొత్తదనాన్ని తీసుకురావడం సమంత ప్రత్యేకత. గ్లామర్ ఫోటోషూట్లలోను, ట్రెడిషనల్ లుక్స్‌లోను అదరగొట్టే ఈ భామ, తన కొత్త స్టైల్ స్టేట్మెంట్‌లతో అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. ఇటీవల ఆమె ఫిట్‌నెస్, మైండ్సెట్ గురించి ఎక్కువగా ఫోకస్ చేస్తూ, ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు కృషి చేస్తోంది.
కెరీర్‌తో పాటు వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న ఒడిదొడుకులను ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగుతోంది. ఇప్పుడు లేటెస్ట్ గా సమంత చేసిన ఫోటోషూట్ మళ్లీ ట్రెండ్ అవుతోంది. లావెండర్ షేడ్స్‌లో డిజైన్ చేసిన స్టైలిష్ సారీ, గ్లామర్ టచ్‌తో ఉన్న బ్లౌజ్, బ్రిలియంట్ కేప్ డిజైన్‌తో కూడిన ఈ అవుట్‌ఫిట్‌లో సమంత మైండ్ బ్లోయింగ్ లుక్‌తో కనిపించింది. ఆమె మేకప్, హెయిర్‌స్టైల్ అన్ని కూడా హై క్లాస్ ఫీల్ ఇచ్చేలా ఉన్నాయి. ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్, డిజైనర్స్ సమర్థంగా ప్లాన్ చేసిన ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సమంత తనదైన గ్రేస్, స్టైలిష్ అటిట్యూడ్‌తో ఈ ఫోటోషూట్‌ను మరింత స్పెషల్‌గా మార్చింది.
ఇకపోతే, సమంత కెరీర్ పరంగా ‘సిటాడెల్’ వెబ్ సిరీస్‌తో మంచి గుర్తింపు అందుకుంటోంది. హాలీవుడ్ స్థాయిలో ఈ ప్రాజెక్ట్‌లో సమంత యాక్షన్ సీన్స్ చేయడం విశేషం. మరోవైపు ఆమె రక్త బ్రహాండ్ అనే చిత్రంతోనూ బిజీగా ఉంది. ఇప్పుడు ఆమె కొత్త లుక్, ఫిట్‌నెస్ ట్రాన్స్‌ఫర్మేషన్ చూసిన తర్వాత, అభిమానులు మరోసారి ఆమె బిగ్ స్క్రీన్ మేజిక్ చూడటానికి ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.