ప్ర‌ధాని మోదీకి క‌న్నీళ్లు వచ్చాయి..UK ఫ్యాన్స్‌తో మెగాస్టార్!

ఎంత ఎదిగినా ఒదిగి ఉండే స్వ‌భావంతో మెగాస్టార్ చిరంజీవి హృద‌యాల‌ను గెలుచుకున్నారు.;

Update: 2025-03-21 13:50 GMT

ఎంత ఎదిగినా ఒదిగి ఉండే స్వ‌భావంతో మెగాస్టార్ చిరంజీవి హృద‌యాల‌ను గెలుచుకున్నారు. ఆయ‌న బ్రిటిన్ పార్ట‌మెంట్ లో అరుదైన గౌర‌వాన్ని అందుకోవ‌డ‌మే కాదు... ఆ దేశంలో ప‌ర్య‌టించి అక్క చెల్లెమ్మ‌ల‌ను, సోద‌రుల‌ను ప‌ల‌క‌రిస్తున్నారు. ఆయ‌న స్పీచ్‌ల‌లో ఉద్వేగం కొట్టొచ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. చిరు ప‌ర్య‌ట‌న ఆద్య‌తం అక్క చెల్లెమ్మ‌ల ప్ర‌స్థావ‌న కొట్టొచ్చిన‌ట్టు క‌నిపించింది. ``ఇక్క‌డ ఇంటింటికి వెళ్లి చెల్మెమ్మ‌ల వంట‌కాలు తినాల‌ని అనిపిస్తోంది. కానీ ఆ అవ‌కాశం ఎలా వ‌స్తుందో తెలీదు. భ‌విష్య‌త్ లో ఆ అవ‌కాశం వ‌స్తుంద‌ని ఆశిస్తున్నాను`` అని అన్నారు. సోద‌ర సోద‌రీమణుల ప్రేమ‌కు దాసుడిని. జీవితంలో మీరు ఏం సాధించినా నేను సాధించిన‌ట్టేన‌ని చిరు అన్నారు.

UK పార్లమెంట్‌లోని హౌస్ ఆఫ్ కామన్స్‌లో జరిగిన కార్యక్రమంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి టీమ్ బ్రిడ్జ్ ఇండియా నుండి లైఫ్‌టైమ్ అఛీవ్‌మెంట్ అవార్డు(జీవిత సాఫ‌ల్య పుర‌స్కారం)ను అందుకున్నారు. పుర‌స్కారం అందుకున్న సంద‌ర్భంగా ఆయ‌న కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. హౌస్ ఆఫ్ కామన్స్ - UK పార్లమెంట్‌లో చాలా మంది గౌరవనీయులైన పార్లమెంట్ సభ్యులు, మంత్రులు, సెక్రటరీలు, దౌత్యవేత్తలు ఇచ్చిన గౌరవానికి హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది. నాపై వారి మాట‌లు విన‌యం ఆనందాన్నిచ్చాయి. టీమ్ బ్రిడ్జ్ ఇండియా లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు నా హృద‌యాన్ని తాకింది అని అన్నారు. చిరు త‌న ప్ర‌యాణంలో స‌హ‌క‌రించిన కుటుంబం, త‌న‌ సోద‌ర‌సోద‌రీమ‌ణులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు, అభిమానులు, సామాజిక క‌ర్త‌ల‌కు అంద‌రికీ ధ‌న్య‌వాదాలు తెలిపారు.

అలాగే గ‌త ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన‌ త‌న సోద‌రుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ పొలిటిక‌ల్ విక్ట‌రీ అనంత‌రం నేరుగా త‌న ఇంటికి వ‌చ్చి ఆశీర్వాదం తీసుకున్న వీడియోను ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ వీక్షించార‌ని, ఆయ‌న ఆ దృశ్యం చూసి త‌న‌కు క‌న్నీళ్లు వచ్చాయ‌ని అన్నార‌ని చిరు అన్నారు. అన్న‌ద‌మ్ములు ఎలా ఉండాలో మీరు చూపించారు! అని మోదీ ప్ర‌శంసించార‌ని తెలిపారు.

Tags:    

Similar News