వీడియో : ఐస్‌క్రీం కోసం కీర్తి సురేష్‌ తిప్పలు

'బేబీజాన్‌' సినిమాతో బాలీవుడ్‌లో అడుగు పెట్టిన కీర్తి సురేష్‌ ఆశించిన స్థాయిలో హిట్‌ను అందుకోలేక పోయింది.;

Update: 2025-03-21 14:24 GMT

'బేబీజాన్‌' సినిమాతో బాలీవుడ్‌లో అడుగు పెట్టిన కీర్తి సురేష్‌ ఆశించిన స్థాయిలో హిట్‌ను అందుకోలేక పోయింది. గత ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశ పరిచింది. హీరోయిన్‌గా సౌత్‌లో వరుస సినిమాలు చేస్తున్న కీర్తి సురేష్ బాలీవుడ్‌లోనూ బిజీ కావాలని ప్రయత్నాలు చేస్తుంది. బేబీ జాన్‌ నిరాశ పరచినా వెంటనే 'అక్క' అనే వెబ్‌ సిరీస్‌లో నటిస్తోంది. రాధిక ఆప్టేతో కలిసి కీర్తి సురేష్ చేస్తున్న 'అక్క' వెబ్‌ సిరీస్‌ త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. బేబీ జాన్‌తో తన నటన ప్రతిభ కనబర్చే అవకాశం దక్కించుకోలేక పోయిన కీర్తి సురేష్ 'అక్క' లో తన నటన విశ్వరూపం చూపించబోతున్నట్లు సమాచారం అందుతోంది.

హిందీలో 'అక్క' వెబ్‌ సిరీస్‌ను చేస్తుండటంతో పాటు తమిళ్‌లో రెండు సినిమాలు చేస్తుంది. మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. తెలుగులో ఈ మధ్య ఈమెకు పెద్ద ఆఫర్లు రావడం లేదు. చివరగా ఈమె చిరంజీవి సినిమా భోళా శంకర్‌లో నటిచింది. ఆ సినిమాలోనూ హీరోయిన్‌గా కాకుండా ముఖ్య పాత్రలో నటించిన విషయం తెల్సిందే. కీర్తి సురేష్‌ తెలుగులో మహానటితో పాటు పలు సినిమాల్లో నటించి సక్సెస్‌లను దక్కించుకుంది. నానితో కలిసి నటించిన దసరా సినిమాలో డీ గ్లామర్‌గా కనిపించి నటనతో సర్‌ప్రైజ్‌ చేసిన విషయం తెల్సిందే. ఎప్పటికప్పుడు తన నటనతో, లుక్‌తో ఆకట్టుకుంటున్న కీర్తి సురేష్ సోషల్‌ మీడియాలో అందమైన ఫోటోలు, వీడియోలు షేర్ చేయడం ద్వారా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.

తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా కీర్తి సురేష్ ఫన్నీ వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోలో టర్కిష్ ఐస్‌ క్రీమ్‌ తీసుకున్న వీడియోను పంచుకుంది. ఈ మధ్య కాలంలో టర్కిష్ ఐస్‌ క్రీమ్‌ వీడియోలు తెగ వైరల్‌ అవుతున్నాయి. పెద్ద కర్రతో ఐస్ క్రీమ్‌ చేతిలో పెట్టినట్లుగానే పెట్టి లాగేసుకుంటూ, అవతలి వారిని కన్ఫ్యూజ్‌ చేసి నవ్వించి చివరకు ఐస్‌ క్రీమ్‌ చేతిలో పెడతారు. అదే విధంగా కీర్తి సురేష్ ని సైతం టర్కిస్‌ ఐస్‌ క్రీమ్‌ వాలా కొద్ది సమయం ఆట పట్టించాడు. ఐస్‌ క్రీమ్‌ను అందుకునేందుకు కీర్తి సురేష్ చాలానే ప్రయత్నించింది. చాలా సమయం కీర్తి సురేష్ ఐస్‌ క్రీమ్‌ కోసం తిప్పలు పడింది. చివరకు ఐస్‌ క్రీమ్‌ అందుకున్న కీర్తి సురేష్‌ డబ్బులను ఇచ్చే సమయంలో తాను కొద్ది సమయం అవతలి వ్యక్తిని ఆట ఆడించింది. జస్ట్‌ ఫర్‌ ఫన్‌ అంటూ ఈ వీడియోను కీర్తి సురేష్ ఇన్‌స్టాలో షేర్‌ చేసింది. తక్కువ సమయంలోనే ఈ వీడియోకు మూడు లక్షల లైక్స్ దక్కడంతో పాటు మిలియన్‌ల కొద్ది వ్యూస్ దక్కాయి.

గత ఏడాది కీర్తి సురేష్ పెళ్లి పీటలు ఎక్కింది. సుదీర్ఘ కాలంగా ఆంటోనీ తటిల్‌తో ప్రేమలో ఉన్న కీర్తి సురేష్ ఇరు కుటుంబ సభ్యుల ఒప్పందంతో పెళ్లి చేసుకుంది. హిందూ, క్రిస్టియన్‌ మతాల పద్దతిలో వీరి వివాహం వైభవంగా జరిగింది. పెళ్లికి ఇండస్ట్రీ నుంచి ప్రముఖులు హాజరు అయ్యారు. ముఖ్యంగా తమిళ్‌ సూపర్‌ స్టార్‌ విజయ్ పెళ్లికి హాజరు అయ్యాడు. పెళ్లి తర్వాత కీర్తి సురేష్ కొంత గ్యాప్‌ తీసుకుంటుందనే ప్రచారం జరిగింది. కానీ కీర్తి సురేష్ పెళ్లి అయిన వెంటనే బేబీ జాన్‌ సినిమా ప్రమోషన్‌లో పాల్గొంది. ఇటీవల అక్క సిరీస్‌తో పాటు రెండు తమిళ్‌ సినిమాల షూటింగ్స్‌లో పాల్గొంటుంది. పెళ్లి తర్వాత ఏమాత్రం గ్యాప్‌ తీసుకోకుండా మరింత స్పీడ్‌గా సినిమాలు చేస్తుంది. అంతే కాకుండా గతంతో పోల్చితే స్కిన్‌ షో విషయంలో పట్టు విడుపులు చూపిస్తున్నట్లు టాక్‌ వినిపిస్తుంది. తెలుగులో ఈమె రీ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Tags:    

Similar News