హీరోయిన్లను కూతుళ్లుగా చూసుకునే దర్శకుడతను!
పాయల్ ఘోస్ అప్పట్లో కొంత మంది దర్శకులు..హీరోలపై కూడా సంచలన ఆరోపణలు చేసింది.
మీటూ ఉద్యమంలో భాగంగా బాలీవుడ్ నుంచి కాస్టింగ్ కౌచ్ గురించి ఎంతో మంది నటీమణులు స్పందించారు. బాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ ఉందని గొంతెత్తిన హీరోయిన్లు చాలా మంది ఉన్నారు. కమిట్ మెంట్ లేనిదే బాలీవుడ్ లో అవకాశాలివ్వరూ కంగనా రనౌత్ ఓపెన్ గానే చెప్పింది. ఇంకా ఈ జాబితాలో విద్యాబాలన్..దీపికా పదుకొణే..ప్రియాంక చోప్రా...కత్రినా కైఫ్ లాంటి వారు అలాగే స్పందించారు. ఇండస్ట్రీలో తమకెదురైన అనుభవాల గురించిచెప్పే ప్రయత్నం చేసారు. పాయల్ ఘోస్ అప్పట్లో కొంత మంది దర్శకులు..హీరోలపై కూడా సంచలన ఆరోపణలు చేసింది.
ఇప్పటికీ అప్పుడప్పుడు కాస్టింగ్ కౌచ్ గురించి ఏదో పోస్ట్ పెడుతూనే ఉంటుంది. ఇంకా అవకాశాల పేరుతో ఛాన్స్ ఎలా తీసుకుంటారు..నమ్మించి మోసం చేస్తారు? వంటి అంశాలపై రోజు కథనాలు వైరల్ అవుతూనే ఉంటాయి. ఈ నేపథ్యంలో తాజాగా కళాత్మక చిత్రాల దర్శకుడు సంజయ్ లీలాభన్సాలీ గురించి హీరోయిన్ అతిది రావ్ హైదరీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. `సంజయ్ సినిమాల్లో మహిళల్ని చూపించే విధానం ఎంతో హుందాగా ఉటుంది. వాళ్లు ఎంత ప్రేమ చూపిస్తారో? అంతే పగను తీర్చుకోగలరు అని ఆయన సినిమాల్లో హీరోయిన్లను చూపిస్తుంటారు.
ఇలా కొద్ది మంది దర్శకులే మహిళలకు అంతటి ప్రాధాన్యత ఇస్తారు.మహిళలంటే ఆయనకు ఎంతో గౌరవం. పద్మావత్ లో ఆయనతో కలిసి పనిచేసాను. ఆ అనుభవం ఎప్పటికీ మర్చిపోలేను. మళ్లీ ఆయనతో కలిసి పనిచేసే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. హీరోయిన్లను ఆయన కుమార్తె సమానంగా చూస్తారు. ఇంట్లో ఆయనకు కూతురు ఉంటే ఎలా ట్రీట్ చేస్తారో? సెట్ లో హీరయిన్ ని అలాగే అంతే అభిమానంతో చూస్తారు. ఆయన ప్రేమ..ఆప్యాయత అపారమైనది. ఆయనతో పనిచేస్తున్నప్పుడు మైదానంలో చిన్న పిల్లలు ఆడుకుంటున్నట్లే ఉంటుంది.
అలాంటి దర్శకుడిని నేనింత వరకూ చూడలేదు` అని పేర్కొంది. ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలీ హీరామండి అనే వెబ్ సిరీస్ తెరకక్కిస్తోన్న సంగతి తెలిసిందే. మనీషా కోయిరాలా..అతిది రావ్ హైదరీ..సోనాక్షి సిన్హా.. రిచా చద్దా..సంజీదా షేక్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్అయిన ప్రచార చిత్రాలతో మరో కళాత్మక సిరీస్ తీసినట్లు తెలుస్తుంది. ప్రచార చిత్రాల్లో హీరోయిన్లు అందర్నీ ఎంతో అందంగా చూపించారు. ఈ సిరీస్ పై భారీ అంచనాలే ఉన్నాయి. రిలీజ్ కోసం అభిమానులు అంతే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.