'RRR' తర్వాత తారక్, చరణ్ లైనప్ ఓకే.. కానీ?

ఈ ఒక్క సినిమాతో తారక్, చరణ్ ల పేర్లు గ్లోబల్ వైడ్ గా మార్మోగిపోయాయి.

Update: 2024-01-26 02:30 GMT

'RRR' సినిమాతో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరు గ్లోబల్ స్టార్స్ గా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు గా చరణ్, కొమరం భీం గా తారక్ తమ అద్భుత నటనతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు సినిమాలో ఇద్దరి నటనకి హాలీవుడ్ నటీనటులు సైతం ఫిదా అయిపోయారు. ఈ ఒక్క సినిమాతో తారక్, చరణ్ ల పేర్లు గ్లోబల్ వైడ్ గా మార్మోగిపోయాయి.

ఇక ఈ సినిమాతో వచ్చిన క్రేజ్ ని మరింత పెంచుకునేందుకు అటు చరణ్ ఇటు తారక్ ఇద్దరూ భారీ లైనప్ సెట్ చేసుకున్నారు. RRR తర్వాత ఈ హీరోలు నటిస్తున్న సినిమాలన్నీ దాదాపు భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలోనే తెరకెక్కబోతున్నాయి. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. కానీ ఈ భారీ సినిమాల షూటింగ్స్ ఆలస్యం అవుతున్నాయి. ఇద్దరు హీరోలది ఇదే పరిస్థితి.

ఎన్టీఆర్ విషయానికొస్తే.. RRR తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' అనే భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. రెండు భాగాలుగా ఈ సినిమా రాబోతోంది. ఇందులో పార్ట్-1 ని ఏప్రిల్ 5న విడుదల చేస్తున్నట్లు ముందే అనౌన్స్ చేశారు. తీరా చూస్తే ఇప్పుడు సినిమా రిలీజ్ VFX పనులు, ఇతర కారణాలతో రిలీజ్ వాయిదా పడింది. దేవర తర్వాత బాలీవుడ్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ 'వార్ 2', ప్రశాంత్ నీల్ తో NTR31, దేవర పార్ట్-2, ఆ తర్వాత త్రివిక్రమ్ తో ఓ ప్రాజెక్ట్ ఉండే అవకాశం ఉంది.

దేవర ఆలస్యంతో ఈ సినిమాలన్నీ అనుకున్న సమయానికి పట్టాలెక్కుతాయా లేదా అనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఇక రామ్ చరణ్ పరిస్థితి కూడా దాదాపు అలాగే ఉంది. RRR తర్వాత సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో 'గేమ్ ఛేంజర్' సినిమాని ప్రకటించాడు. ఈ సినిమా స్టార్ట్ చేసి 2 సంవత్సరాలకు దగ్గరగా అవుతోంది. డైరెక్టర్ శంకర్ మధ్యలో 'ఇండియన్ 2' సినిమా కోసం 'గేమ్ ఛేంజర్' షూటింగ్ ని పక్కన పెట్టడం, రీసెంట్ గా రామ్ చరణ్ కి గాయం అవ్వడం లాంటి కారణాలవల్ల షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది.

ప్రస్తుతం షూటింగ్ లాస్ట్ స్టేజ్ లో ఉందని అంటున్నారు. కానీ సినిమాని ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారనేది క్లారిటీ లేదు. గేమ్ చేంజర్ తర్వాత చరణ్ ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబుతో 'RC16' ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇప్పటికే మొదలు కావాల్సింది. కానీ గేమ్ ఛేంజర్ షూటింగ్ వాయిదా పడుతూ రావడంతో ఇప్పటివరకు 'RC16' పట్టాలెక్కలేదు. దీని తర్వాత చరణ్ సుకుమార్ తో ఓ సినిమాకి కమిట్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్స్ ఎప్పుడు కార్యరూపం దాల్చుతాయో కాలమే నిర్ణయించాలి.


Tags:    

Similar News