అడ్డంగా బుక్కైన ఐశ్వ‌ర్యా రాజేష్‌!

ఇటీవ‌లే జ‌స్టిస్ హేమ క‌మిటీ నివేదిక దేశ వ్యాప్తంగా ఎంత చ‌ర్చ‌నీయాంశ‌మైందో తెలిసిందే.

Update: 2024-09-28 11:30 GMT

చిత్ర ప‌రిశ్ర‌మ‌ల్లో ఎలాంటి లైంగిక వేధింపులు లేవు అన్న వారి కంటే? ఉన్నాయి అన్న వారిసంఖ్య ఎక్కువ‌గా ఉంది. మ‌హిళ‌ల‌పై దాష్టికాలు జ‌రుగుతున్నా? అవ‌కాశాలు రావు అన్న కార‌ణంగా భ‌య‌ప‌డి బాధితులు ముందుకు రావ‌డం లేద‌ని ఎన్నో సంద‌ర్భాల్లో రుజువైంద‌ని మెజార్టీ వ‌ర్గం అభిప్రాయ‌ప‌డింది. ఇటీవ‌లే జ‌స్టిస్ హేమ క‌మిటీ నివేదిక దేశ వ్యాప్తంగా ఎంత చ‌ర్చ‌నీయాంశ‌మైందో తెలిసిందే.

అలాగే ఎలాంటి లైంగిక వేధింపులు లేవ‌ని వారించినవారు చాలా మంది ఉన్నారు. అందులో ఐశ్వ‌ర్య రాజేష్ కూడా ఉండ‌టం గ‌మ‌నార్హం. త‌మిళ సినిమాల‌తో వెలుగులోకి వ‌చ్చిన అమ్మ‌డు కోలీవుడ్ లో మాత్రం ఎలాంటి లైంగిక వేధింపులు లేవ‌ని అలాగే తెలుగు , క‌న్న‌డలోనూ ఎలాంటి వేధింపులు లేవు అని..తాను ఇంత‌వ‌ర‌కూ అలాంటి బారిన ప‌డ‌లేద‌ని తెలిపింది. ఇది కేవ‌లం త‌న వ్య‌క్తిగ‌త అభిప్రాయంగానే షేర్ చేసుకుంది.

అయితే ఈ వ్యాఖ్య‌ల్ని సీనియ‌ర్ న‌టి ఖుష్పూ స‌హా చాలా మంది ఖండించారు. వేధింపబ‌డ్డ బాధితుల గురించి నీకేం తెలుసంటూ గ‌ట్టిగానే క్లాస్ పీకారు. అయితే తాజాగా త‌మిళ న‌టి శృతి హ‌రిహ‌ర‌న్ ఓ సినిమా కోసం త‌న‌ని ఏకంగా ఐదుగురు నిర్మాత‌లు రాజీ ప‌డిమ‌న్నార‌ని అడిగిన‌ట్లు ఆరోపించింది. ఈ అమ్మ‌డు మాలీవుడ్ నుంచి కోలీవుడ్ కి వ‌చ్చి సినిమాలు చేసింది. ఇప్పుడీ వ్యాఖ్య‌లు కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి.

దీంతో ఐశ్వ‌ర్యా రాజేష్ అడ్డంగా బుక్ అయింది. అమ్మ‌డిప్పుడు సోష‌ల్ మీడియాలోట్రోలింగ్ గురైంది. బాధిత మ‌హిళ లైంగికంగా వేధిస్తున్నార‌ని ఆరోపిస్తుంటే...ఐశ్వ‌ర్యా రాజేష్ అలాంటివేమి లేవు? అంటోంది ఏంటి? అంటూ పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. అయితే గ‌తంలో శృతి హ‌రిహ‌ర‌న్ అర్జున్ స‌ర్జాపై కూడా లైంగిక ఆరోప‌ణ‌లు చేసింది. కానీ ఆరోప‌ణ‌లుగా తేల‌డంతో కోర్టు ఈ కేసును కొట్టేసింది.

Tags:    

Similar News