ఆకాంక్ష రాంజ‌న్ క‌పూర్ స్ట‌న్నింగ్ లుక్

ఇంత‌లోనే త‌న‌ వ్య‌క్తిగ‌త జీవితంలో ఆకాంక్ష రాంజ‌న్ ఫుల్ ఖుషీగా ఉంద‌ని అర్థ‌మవుతోంది. ఈసారి ఎన్.వై.ఇ 2025 పార్టీని ఈ బ్యూటీ విదేశీ బీచ్ లొకేష‌న్ లో జ‌రుపుకుంది.

Update: 2025-01-02 04:19 GMT

బాలీవుడ్ అందాల కథానాయిక‌ ఆకాంక్ష రాంజన్ క‌పూర్ 2020 నెట్‌ఫ్లిక్స్ చిత్రం గిల్టీతో అరంగేట్రం చేసింది. తర్వాత 2021 వెబ్ సిరీస్ `రే` ..2022 నెట్‌ఫ్లిక్స్ ఇండియా చిత్రం `మోనికా, ఓ మై డార్లింగ్‌`లో నటించింది. తెలుగులో సందీప్ కిష‌న్ స‌ర‌స‌న‌ CV కుమార్ `మాయ వన్`లో న‌టించింది. 2017 చిత్రం మాయవన్‌కి ఇది సీక్వెల్ గా రూపొందింది. ఇటీవ‌ల జిగ్రాలో ఒక చిన్న కామియోల‌ను ఆకాంక్ష క‌నిపించింది. ప్ర‌స్తుతం సినిమాల్లేక తీరిగ్గానే ఉంది.

ఇంత‌లోనే త‌న‌ వ్య‌క్తిగ‌త జీవితంలో ఆకాంక్ష రాంజ‌న్ ఫుల్ ఖుషీగా ఉంద‌ని అర్థ‌మవుతోంది. ఈసారి ఎన్.వై.ఇ 2025 పార్టీని ఈ బ్యూటీ విదేశీ బీచ్ లొకేష‌న్ లో జ‌రుపుకుంది. అందుకు సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ తాజాగా ఇంట‌ర్నెట్ లో విడుద‌లయ్యాయి. ఆకాంక్ష పొట్టి చినుగుల నిక్క‌రు... ఇన్న‌ర్ అందాల ఆర‌బోత‌తో డాషింగ్ గా క‌నిపించింది. ఇక ఇన్న‌ర్ అందాల‌ను క‌వ‌ర్ చేసేందుకు వైట్ ష‌ర్ట్ కూడా ధ‌రించింది. అయితే త‌న నిక్క‌రుకు కానీ, ష‌ర్ట్ కి కానీ ఆకాంక్ష బ‌ట‌న్స్ పెట్టుకోవ‌డం మ‌ర్చిపోయింది. ప్ర‌స్తుతం ఈ స్పెష‌ల్ ఫోటోషూట్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా దూసుకెళుతోంది.

కొత్త సంవ‌త్స‌రంలో కొత్త హోప్స్ తో క‌నిపిస్తోంది ఆకాంక్ష‌. అన్న‌ట్టు ఈ బ్యూటీ మంచి ఫిట్ నెస్ ఫ్రీక్ కూడా. బాలీవుడ్ లో టాప్ సెల‌బ్రిటీల‌తో పోటీప‌డుతూ ఆకాంక్ష ఇంకా ఫిట్ గా క‌నిపిస్తోంది. దీనికోసం జిమ్ లో నిరంత‌రం శ్ర‌మిస్తాన‌ని చెబుతోంది.


Tags:    

Similar News