ఆమెను క్షమించేది లేదన్న అఖిల్..!

కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు నిరాధారమైనవి అత్యంత అసభ్యకరంగా జుగుప్సాకరంగా ఉన్నాయని అఖిల్ రాసుకొచ్చాడు.

Update: 2024-10-04 05:45 GMT

అక్కినేని ఫ్యామిలీతో పాటు సమంత మీద తెలంగాణా మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు మొత్తం సినీ పరిశ్రమ కదిలి వచ్చింది. తమ రాజకీయాల కోసం సినీ సెలబ్రిటీస్ ని అవమాన పరిచేలా మాట్లాడటం.. వ్యక్తిగత విషయాలను ఇలా రాజకీయాల కోసం ప్రస్తావించడం బాధాకరమంటూ అందరు తమ సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం మీద స్పందించారు. ఈ విషయంలో టోటల్ ఇండస్ట్రీ ఒకే తాటిమీదకు వచ్చింది. అటు అక్కినేని ఫ్యామిలీతో పాటు సమంతకు తమ సపోర్ట్ ఉన్నామని ప్రూవ్ చేశారు.

ఐతే ఈ విషయంపై కొండా సురేఖ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా అని చెప్పినా కూడా ఆమెను వదల్లేదు. ఆల్రెడీ అక్కినేని ఫ్యామిలీ ఆమె మీద లీగల్ ఫైట్ కు సిద్ధం కాగా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై అక్కినేని అఖిల్ మరోసారి ఘాటుగా స్పందించాడు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారిని క్షమించేది లేదని అన్నాడు. తన సోషల్ మీడియా ఖాతాలో కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల మీద సీరియస్ అయ్యాడు అఖిల్.

కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు నిరాధారమైనవి అత్యంత అసభ్యకరంగా జుగుప్సాకరంగా ఉన్నాయని అఖిల్ రాసుకొచ్చాడు. ప్రజా సేవకురాలు అయిన ఆమె ప్రజలకు రక్షణ కల్పించాలి కానీ ఆమె సామాజిక సంక్షేమాన్ని మర్చిపోవాలని నిరయించుకుందని అన్నారు. ఆమె ప్రవర్తించిన తీరు సిగ్గుచేటుగా ఉందని.. ఇది క్షమించరానిది.. స్వార్థపూరితంగా గెలవడానికి ప్రయత్నిస్తున్న రాజకీయ యుద్ధంలో తనకన్నా ఉన్నత విలువలు ఉన్న వ్యక్తులను బలిపశువును చేసిందని అన్నారు.

ఒక ఫ్యామిలీ మెంబర్ గా, సినిమా వాడిగా తాను మౌనంగా ఉండను. మన సమాజంలో ఆమె లాంటి వాళ్లకు స్పేస్ ఉండకూడదు.. ఆమెను క్షమించేది లేదని అఖిల్ వార్నింగ్ ఇచ్చాడు. గురువారం మొత్తం సోషల్ మీడియాలో ఇదే హైలెట్ టాపిక్ కాగా అఖిల్ ఈరోజు కూడా కొండా సురేఖని టార్గెట్ చేస్తూ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడు.

కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల వల్ల తెలుగు సినీ పరిశ్రమ యూనిటీ ఏంటన్నది తెలిసింది. రాజకీయాలకు సంబంధం లేని ఒక ఫ్యామిలీ, ఇంకా హీరోయిన్ పై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని సినీ సెలబ్రిటీస్ అంతా ఒక్క తాటిపై వచ్చి తమ అసహనాన్ని వ్యక్తం చేశారు.

Tags:    

Similar News