అభిమానులే కాదు..అక్కినేని ఫ్యామిలీ కూడా!
ఈ నేపథ్యంలో అక్కినేని కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్న ఒకే ఒక్క చిత్రం `తండేల్`.
అక్కినేని హీరోలెవరూ ఇంత వరకూ సెంచరీ కొట్టింది లేదు. 100 కోట్ల క్లబ్ లో ఏ హీరో చేరలేదు. కింగ్ నాగార్జున, నాగచైతన్య, అఖిల్ అంతా! సెంచరీలోపే కనిపిస్తున్నారు. వాళ్ల కంటే ముందు..ఆ తర్వాత వచ్చిన యంగ్ హీరోలు సైతం వంద కోట్ల క్లబ్లో చేరిపోయారు గానీ....అక్కినేని వారసులు మాత్రం ఇంకా ఆ వరుసలో చేరలేదు. ఈ నేపథ్యంలో అక్కినేని కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్న ఒకే ఒక్క చిత్రం `తండేల్`.
నాగ చైతన్య కథానాయకుడిగా చందు మొండేటి తెరకెక్కించిన చిత్రమిది. శ్రీకాకుళం మత్సకారుల జీవితం ఆధారంగా తెరకెక్కించారు. వాస్తవ సంఘటనలు ఆధారంగా తెరకెక్కించడం తో పాటు రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో సినిమాకి భారీ హైప్ క్రియేట్ అయింది. ఇదంతా ఒక ఎత్తైతే చందు మొండేటి` కార్తికేయ-2` తర్వాత చేస్తోన్న చిత్రం కావడం మరో విశేషం. పాన్ ఇండియాలో ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన `కార్తికేయ2` భారీ వసూళ్లను సాధించింది.
ఆ సినిమా 110 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. దీంతో అందులో హీరోగా నటించిన నిఖిల్ కూడా 100 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. ఆ తర్వాత నుంచి చందు `తండేల్` పైనే ఫోకస్ పెట్టాడు. ఈ కథపై ఎంతో రీసెర్చ్ చేసాడు. స్క్రిప్ట్ రాసే దశలో శ్రీకాకుళం, విశాఖ పట్టణం మత్సకారుల దగ్గరకు వెళ్లి అవసరమైన సమాచారాన్నిసేకరించి ఆ కథని కమర్శియలైజ్డ్ చేసాడు. పాత్రల ఎంపిక విషయంలోనూ ఎంతో ప్లానింగ్ తో ఎంపిక చేసాడు.
సాయి పల్లవి లాంటి నేచురల్ పెర్పార్మర్ సినిమాకి పిల్లర్ లా నిలబడుతుందని ప్రచార చిత్రాలతో అర్దమవుతోంది. నాగచైతన్య సైతం ఎంతో నేచురల్ పెర్పార్మెన్స్ ఇచ్చాడని ట్రైలర్ తెలుస్తోంది. సినిమా కోంస తానెంత కష్టపడ్డాడు? అన్నది మాటల్లో అర్దమవుతుంది. ఇలా ప్రతీ అంశం `తండేల్` పై భారీ హైప్ తీసుకొస్తుంది. మరి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాలు సాధిస్తుంది? అన్నది చూడాలి.