సినిమా భాషపై వెంకయ్య అసంతృప్తి..!

అక్కినేని నాగేశ్వర రావు శత జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుకలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా అటెండ్ అయ్యారు

Update: 2023-09-20 08:24 GMT

అక్కినేని నాగేశ్వర రావు శత జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుకలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా అటెండ్ అయ్యారు. శత జయంతి సందర్భంగా ఏఎన్నార్ స్టాట్యూ కూడా ఆవిష్కరించారు వెంకయ్యనాయుడు. ఏఎన్నార్ తో తనకున్న అనుబంధాన్ని తెలుగు చిత్ర పరిశ్రమకు చేసిన గొప్ప విషయాల గురించి ప్రస్తావించారు వెంకయ్యనాయుడు. ఇక ఇదే వేడుకలో ప్రస్తుత సినిమా భాష మీద తన మార్క్ సెటైర్ వేశారు వెంకయ్యనాయుడు.

ప్రస్తుతం సినిమా భాష బాగాలేదని అవసరం ఉన్నా లేకపోయినా డబుల్ మీనింగ్ డైలాగులు వాడుతున్నారని అన్నారు వెంకయ్య నాయుడు. ఆ డైలాగ్స్ వాడకపోయినా సినిమా నడుస్తుంది కానీ అవి లేకుండా ఈమధ్య సినిమాలు ఉండట్లేదని అన్నారు వెంకయ్య నాయుడు. అశ్లీలమైన డైలాగ్స్ లేకుండా సినిమా తీయొచ్చనే విషయం ఫిల్మ్ మేకర్స్ కి తెలిసినట్టు లేదని ఆయన అన్నారు. అశ్లీలమైన విషయాలను చూపించి పిల్లల్ని యువ తరాన్ని నాశనం చేస్తున్నారని గుర్తించాలని అన్నారు.

సినిమా భాషపై వెంకయ్య కామెంట్స్ సమర్ధించదగినవే. అయితే యూత్ ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేయాలంటే అలాంటి డైలాగ్స్ కంపల్సరీ. కోట్ల బడ్జెట్ పెట్టి సినిమా తీసే నిర్మాత తన సినిమాను అందరు ఎగబడి చూడాలని అనుకుంటాడు ఆ టైం లో యూత్ కోరుకునే డైలాగ్స్ పెడితే సినిమాలను హిట్ చేస్తారు. ప్రస్తుత ఫిల్మ్ మేకర్స్ అంతా సినిమా భాషపై సరైన దృష్టి పెట్టాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు.

తెలుగు భాషలో సినిమాలు చేస్తూ ఇక్కడ భాషని కూనీ చేసేలా డైలాగ్స్ ఉంటున్నాయి. ఇది విని కొందరు వెంకయ్యలా తమ అభిప్రాయాలను బాహాటంగా చెబుతుంటే కొందరు మాత్రం ఎవరికి ఎంత చెప్పినా వేస్ట్ అన్నట్టుగా సైలెంట్ గా ఉంటున్నారు. ట్రెండ్ మోజులో పడి తెలుగు భాషకి అనవసరమైన అనుకరణలు చేస్తూ భాషా ప్రేమికుల మనసు గాయపరుస్తున్నారు మన మేకర్స్. మరి వెంకయ్య మాటలు వారు ఏమేరకు మనసులోకి తీసుకుని మాటలు రాస్తారన్నది చూడాలి. వెంకయ్య కామెంట్స్ పై నెటిజన్ల నుంచి కూడా మిశ్రమ స్పందన వస్తుంది. ఇప్పుడే ఇలా ఉంటే రానున్న రోజుల్లో తెలుగు సినిమాల్లో డైలాగ్స్ ఇంకెంత ఘోరంగా ఉంటాయో అంటూ రకరకాల కామెంట్స్ పెడుతున్నారు కొందరు.

Tags:    

Similar News