సోష‌ల్ మీడియా నుంచి కూతురు ఫోటోలు తీసేసిన ఆలియా భ‌ట్

సెల‌బ్రిటీలంద‌రూ త‌మకు పుట్టిన పిల్ల‌ల విష‌యంలో ఎంతో కేర్ తీసుకుంటూ అన్నీ విష‌యాల‌ను సీక్రెట్ గా ఉంచుతుంటారు.;

Update: 2025-03-01 22:30 GMT

సెల‌బ్రిటీలంద‌రూ త‌మకు పుట్టిన పిల్ల‌ల విష‌యంలో ఎంతో కేర్ తీసుకుంటూ అన్నీ విష‌యాల‌ను సీక్రెట్ గా ఉంచుతుంటారు. ఫ్యూచ‌ర్ లో వారి ప్రైవ‌సీకి ఎప్పుడూ ఎక్క‌డా భంగం క‌ల‌గ‌కుండా ఉండాల‌నే కార‌ణంతోని వారి వివరాలేవీ బ‌య‌ట‌కు రానీయ‌కుండా పెంచుతారు. సోష‌ల్ మీడియాలో వారి ఫోటోల‌ను షేర్ చేయ‌కుండా ఉండేది కూడా అందుకే.

విరాట్ కోహ్లీ, అనుష్క శ‌ర్మ త‌మ కూతురు వామిక‌ను ఇంత‌వ‌ర‌కు ఎక్క‌డా రివీల్ చేయ‌లేదు. వామిక పుట్టి మూడేళ్లవుతున్నా వారంత‌ట వారు ఎప్పుడూ వామిక ఫేస్ ను చూపించింది లేదు. వామిక త‌ర్వాత పుట్టిన అకాయ్ విష‌యంలో కూడా కోహ్లీ జంట ప్రైవ‌సీని మెయిన్‌టైన్ చేశారు. టాలీవుడ్ హీరో రామ్ చ‌ర‌ణ్, ఉపాస‌న కూడా ఇప్ప‌టివ‌ర‌కు త‌మ కూతురు క్లీంకార‌ను బ‌య‌టి ప్ర‌పంచానికి చూపించ‌లేదు.

అయితే సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆలియా భ‌ట్ మాత్రం త‌న కూతురు రాహాని అంద‌రికీ ప‌రిచ‌యం చేసి ఆ త‌ర్వాత నుంచి కూతురి ఫోటోల‌ను షేర్ చేస్తూనే ఉంది. కానీ ఆలియా ఇప్పుడు ఉన్న‌ట్టుండి రాహా ఫోటోల‌ను డిలీట్ చేసి అంద‌రికీ షాకిచ్చింది. రాహా క‌నిపించ‌ని ఒక‌టి రెండు ఫోటోలు త‌ప్ప మిగిలిన అన్ని ఫోటోల‌ను సోష‌ల్ మీడియా నుంచి తీసేసింది ఆలియా.

ఆలియా తీసుకున్న డెసిష‌న్ ను నెటిజ‌న్లు గౌర‌విస్తూ ఆమెకు మ‌ద్ద‌తు తెలుపుతున్నారు. ఓ త‌ల్లిగా కూతురి సంరక్ష‌ణ కోసం ఆలియా మంచి నిర్ణ‌య‌మే తీసుకుందంటూ అర్థం చేసుకుంటూ ఆలియా నిర్ణ‌యాన్ని స‌మ‌ర్థిస్తున్నారు. రీసెంట్ గా ఓ సంద‌ర్భంలో కూడా రాహాను ఫోటోలు తీయొద్ద‌ని ఆలియా ఫోటోగ్రాఫ‌ర్ల‌ను కోరిన సంగ‌తి తెలిసిందే.

ఇదిలా ఉంటే కొంత కాలంగా ప్రేమించుకున్న ఆలియా భ‌ట్, ర‌ణ్‌బీర్ క‌పూర్ 2022 ఏప్రిల్ లో పెళ్లి చేసుకున్నారు. అదే సంవ‌త్స‌రం న‌వంబ‌ర్ లో వారికి రాహా పుట్టింది. రాహా పుట్టిన త‌ర్వాత ఏడాదికి అంద‌రికీ ప‌రిచ‌యం చేసిన ఆలియా జంట ఇప్పుడు రాహా పెద్ద‌ద‌వుతున్న నేప‌థ్యంలో త‌న‌పై సోష‌ల్ మీడియా కార‌ణంగా ఎలాంటి ఒత్తిడి ఉండ‌కూడ‌ద‌ని ఆ ఫోటోల‌ను డిలీట్ చేసింది.

Tags:    

Similar News