ప్యారడైజ్ గ్లింప్స్ కోసం అంత ఖర్చు పెట్టారా..?

న్యాచురల్ స్టార్ నాని దసరా తర్వాత శ్రీకాంత్ ఓదెలతో మరో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాకు ప్యారడైజ్ అనే టైటిల్ లాక్ చేశారు. దసరా హీరో, డైరెక్టర్ మాత్రమే కాదు నిర్మాత కూడా సుధాకర్ చెరుకూరి రిపీట్ అవుతున్నారు.

Update: 2025-03-02 18:30 GMT

న్యాచురల్ స్టార్ నాని దసరా తర్వాత శ్రీకాంత్ ఓదెలతో మరో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాకు ప్యారడైజ్ అనే టైటిల్ లాక్ చేశారు. దసరా హీరో, డైరెక్టర్ మాత్రమే కాదు నిర్మాత కూడా సుధాకర్ చెరుకూరి రిపీట్ అవుతున్నారు. సో దసరా కాంబో ఈసారి ఆ సినిమాను మించి సినిమా చేయాలని చూస్తున్నారు. ప్యారడైజ్ సినిమాకు సంబందించి సోమవారం ఒక గ్లింప్స్ రాబోతుందని తెలుస్తుంది. ఇప్పటికే ఆ గ్లింప్స్ గురించి పోస్టర్ రూపంలో రా స్టేట్మెంట్ అంటూ నాని రిలీజ్ చేసిన పోస్టర్ అంచనాలు పెంచేసింది.

ప్యారడైజ్ రా స్టేట్మెంట్ ఒక రేంజ్ లో ఉండబోతుందని తెలుస్తుంది. అంతేకాదు ఈ ఫస్ట్ గ్లింప్స్ కోసమే దాదాపు కోటి రూపాయల దాకా ఖర్చు పెట్టారట మేకర్స్. అంటే సినిమాపై ఫస్ట్ ఇంపాక్ట్ ఏర్పాటు చేయాలి కాబట్టి ప్యారడైజ్ కాన్సెప్ట్ గ్లింప్స్ ని సిద్ధం చేశారట. ఈ గ్లింప్స్ లో భారీ సెట్స్, సీజీ వర్క్ కూడా ఉన్నట్టు సమాచారం. ప్యారడైజ్ గ్లింప్స్ తో నాని ఈ సినిమా రేంజ్ ఏంటన్నది చూపించబోతున్నారు.

అంతేకాదు నాని ప్యారడైజ్ సినిమా 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కబోతుందని అంటున్నారు. నాని కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా రాబోతుంది. శ్రీకాంత్ ఓదెల గత ఆరు నెలలుగా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లోనే ఉన్నాడు. నాని దసరా తో ఎలా అయితే మాస్ ర్యాంపేజ్ చేశాడో రాబోతున్న ప్యారడైజ్ తో మరో లెవెల్ మాస్ చూపించబోతున్నాడని అర్థమవుతుంది. నాని ప్యారడైజ్ నిజంగానే అంత విజువల్ వండర్ గా ఉంటుందా అంటూ ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ ఎగ్జైట్ అవుతున్నారు.

దసరా తర్వాత మళ్లీ నాని కోసమే శ్రీకాంత్ కథ సిద్ధం చేయడం దానికి నాని ఓకే చెప్పడం విశేషం. అంతేకాదు ఈసారి దసరా కాదు దానికి మించి అంటే డబుల్ క్రేజ్ తో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. మరి గ్లింప్స్ ని ఎలా కట్ చేస్తున్నారు.. ఎలాంటి ట్రీట్ ఇస్తున్నారు అన్నది మరికొద్ది గంటల్లో తెలిసిపోతుంది.

నాని ప్రస్తుతం హిట్ 3 సినిమా చేస్తున్నాడు. ఆ మూవీ మే 1న రిలీజ్ అవుతుంది. ఆ సినిమా రిలీజ్ అవ్వడమే ఆలస్యం ప్యారడైజ్ షూటింగ్ లో పాల్గొననున్నాడు నాని. సుధాకర్ చెరుకూరి కూడా ప్యారడైజ్ సినిమాకు నో కాంప్రమైజ్ అనేలా ప్రొడక్షన్ విషయంలో ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టు తెలుస్తుంది.

Tags:    

Similar News