యానిమాల్ పై ఐఏఎస్ కామెంట్.. వంగా స్టన్నింగ్ కౌంటర్
'యానిమల్' సినిమా విడుదలైనప్పటి నుండి వివాదాలు చుట్టుముట్టాయి. కంటెంట్ విషయంగా కొన్ని వర్గాల నుండి విమర్శలు వచ్చినా, బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఈ సినిమా రికార్డులు సృష్టించింది.;
'యానిమల్' సినిమా విడుదలైనప్పటి నుండి వివాదాలు చుట్టుముట్టాయి. కంటెంట్ విషయంగా కొన్ని వర్గాల నుండి విమర్శలు వచ్చినా, బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఈ సినిమా రికార్డులు సృష్టించింది. హీరో ఏ స్థాయిలో గుర్తింపు అందుకున్నాడో దర్శకుడు సందీప్ వంగా కూడా అదే రేంజ్ లో క్రేజ్ అందుకున్నాడు. ఒక విధంగా ఇంటర్వ్యూలలో అతని మాటలకు జనాలు ఫ్యాన్స్ అయిపోయారు. ఎలాంటి విమర్శలకైనా తనదైన శైలిలో కౌంటర్ ఇవ్వగలడు అని ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నాడు.
ఇక సినిమాపై కొంతమంది ప్రముఖులు చేసిన నెగిటివ్ కామెంట్స్ కూడా అప్పట్లో వైరల్ అయ్యాయి. ముఖ్యంగా మాజీ ఐఏఎస్ అధికారి వికాస్ దివ్యకీర్తి చేసిన వ్యాఖ్యలు దర్శకుడు సందీప్ వంగా కు కాస్త నచ్చలేదని తెలుస్తోంది. ‘యానిమల్’ లాంటి సినిమాలు సమాజానికి అవసరం లేదని, కేవలం డబ్బు కోసమే ఇలాంటి సినిమాలు తీయబడుతున్నాయని విమర్శించారు. ఈ వ్యాఖ్యలకు తాజాగా సందీప్ వంగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
ఓ ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సందీప్ వంగా మాట్లాడుతూ, "ఒకవేళ ఐఏఎస్ కావాలంటే, ఢిల్లీలో మంచి కోచింగ్ తీసుకుని, బాగా కష్టపడి చదివితే చాలు. కానీ సినిమాలు తీయడానికి, కథలు రాయడానికి అలాంటి కోర్సులు ఉండవు. ఇవన్నీ ఆసక్తి, స్వీయ అధ్యయనం, అనుభవంతోనే నేర్చుకోవాల్సినవే. కేవలం పుస్తకాలు చదివి సినిమా తీయలేరు" అంటూ స్పష్టంగా చెప్పారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
సినిమాలపై, దర్శకులపై విమర్శలు రావడం కొత్త కాదు. అయితే వికాస్ దివ్యకీర్తి వంటి మాజీ ఐఏఎస్ అధికారి నుండి వచ్చిన విమర్శలు కాస్త వైరల్ అయ్యాయి. ఒక ప్రముఖ అధికారిగా ఉన్న ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అందరికి ఆశ్చర్యం కలిగించింది. ఇక వంగా ఇలాంటి కామెంట్స్ కు రియాక్ట్ కాడేమో అని అందరూ అనుకున్నారు. కానీ వంగా ఈ స్థాయిలో ఆన్సర్ ఇవ్వడం మరీంత హాట్ టాపిక్ గా మారింది.
ఇక యానిమల్ అనంతరం వంగా ప్రభాస్ స్పిరిట్ సినిమాపై ఫోకస్ పెట్టాడు. ప్రభాస్ హీరోగా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కనున్న ఈ సినిమా స్క్రిప్ట్ పనులు ఇంకా ఫినిష్ కాలేదు. ప్రస్తుతం అదే పనిలో ఉన్న వంగా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో కూడా వేగాన్ని పెంచాడు. ఇక త్వరలోనే ఒక అప్డేట్ వచ్చే అవకాశం. సిన్సియర్ కాప్ స్టోరీగా రానున్న ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ మరింత వైలెంట్ గా ఉండనున్నట్లు టాక్. మరి ఆ సినిమాతో వంగా ఎలాంటి ప్రశ్నలు ఎదుర్కొంటారో చూడాలి.