జిగ్రా లుక్ : సెన్సిటివ్ ఆలియా చేతికి వెపన్స్ ఇచ్చారేమిటీ?
అలియా భట్ నటించిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం `జిగ్రా` మరో కొత్త లుక్ ని ఆవిష్కరిస్తోంది. తాజాగా ఆలియా భట్ పోస్టర్‌ను ఆవిష్కరించగా దీనికి అద్భుత స్పందన వస్తోంది.
రాజీ- గంగూభాయి కథియావాడీ, రాఖీ అండ్ రాణీ, ఆర్.ఆర్.ఆర్ .. ఒక్కో సినిమాలో ఒక్కోలా కనిపించింది ఆలియాభట్. నటిగా తనలోని విలక్షణతను ప్రదర్శించడానికి అవకాశం ఉన్న ప్రతి పాత్రను ఎంపిక చేసుకోవడం తనకే సాధ్యమైంది. ఇప్పుడు మరో విలక్షణమైన పాత్రతో అభిమానుల ముందుకు రాబోతోంది. ఈసారి పూర్తిగా యాక్షన్ అవతార్‌లో కనిపిస్తోంది ఆలియా.
అలియా భట్ నటించిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం `జిగ్రా` మరో కొత్త లుక్ ని ఆవిష్కరిస్తోంది. తాజాగా ఆలియా భట్ పోస్టర్‌ను ఆవిష్కరించగా దీనికి అద్భుత స్పందన వస్తోంది. ఇది రెగ్యులర్ సినిమా కాదు. భారీ యాక్షన్ ఎమోషన్స్ కి ఆస్కారం ఉన్న కథలో ఆలియా నటిస్తోందని అర్థమవుతోంది. పోస్టర్ లో డెప్త్, పాత్రల్లో గాంభీర్యం కనిపిస్తోంది. ఈ చిత్రంలో ఆలియా సోదరుడిగా వేదాంగ్ రైనా నటించారు. వేదాంగ్ ఇంటెన్స్ లుక్, భీకరమైన యాక్షన్ నేపథ్యం చూస్తుంటే ఉత్కంఠ కలుగుతోంది. జిగ్రా అంటే హృదయం లేదా ధైర్యం ఇలా భిన్నమైన అర్థాలు ఉన్నాయి. ఆ రెండిటి చుట్టూ తిరిగే కథతోనే ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారని తెలిసింది.
ఈ కథకు జీవం పోయడానికి భట్ ఒక కఠినమైన మేకోవర్ ప్రయత్నించింది. అయితే ఈ పోస్టర్ లో ఆలియా ఆయుధాలను చేత పట్టి సీరియస్ గా కనిపిస్తున్నా ఒక కాలేజ్ విద్యార్థిలా ఎంతో సెన్సిటివ్ గా కనిపిస్తోంది. ఇందులో తన పాత్ర ఏమిటన్న సస్పెన్స్ ఇంకా అలానే కొనసాగుతోంది. ఇక ఈ మూవీకోసం సన్నద్ధతలో భాగంగా బాస్కెట్‌బాల్ నేర్చుకోవడంలో అంకితభావం ప్రదర్శించిందని చిత్రబృందం వెల్లడించింది. ఆలియా ఇంటెన్సివ్ ట్రైనింగ్ సెషన్లలో పాల్గొంది. నైపుణ్యం కలిగిన కోచ్ మార్గదర్శకత్వంలో బాస్కెట్ బాల్ నేర్చుకుంది. అలియా భట్ సొంత బ్యానర్‌లో జిగ్రా రెండవ ప్రయత్నం. డార్లింగ్స్ తర్వాత నిర్మాతగా ఆలియాకు మరో అద్భుత అనుభవం దక్కింది.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) అలియా భట్ `జిగ్రా` టీజర్‌ను ఆమోదించింది. టీజర్ దాదాపు 2 నిమిషాలు ఉంటుందని అంచనా. U సర్టిఫికేట్‌తో క్లియర్ అయింది. వాసన్ బాలన్ దర్శకత్వంలో ధర్మ ప్రొడక్షన్స్ , ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న జిగ్రా అక్టోబరు 11న విడుదల కానుంది. అదే సమయంలో రజనీకాంత్ వేట్టైయన్ థియేటర్లలోకి వస్తుండడంతో ఈ చిత్రం తీవ్రమైన పోటీని ఎదుర్కొంటుంది.