పిక్ టాక్ : పిచ్చెక్కించేంతటి అందం ఈమె సొంతం

బాలీవుడ్ తో పాటు దేశ వ్యాప్తంగా పాపులారిటీ, అభిమానులను కలిగి ఉన్న ముద్దుగుమ్మలు కొద్ది మందే ఉంటారు

Update: 2023-11-23 07:23 GMT

బాలీవుడ్ తో పాటు దేశ వ్యాప్తంగా పాపులారిటీ, అభిమానులను కలిగి ఉన్న ముద్దుగుమ్మలు కొద్ది మందే ఉంటారు. వారిలో ఆలియా భట్ ఒకరు అనడంలో సందేహం లేదు. భాష తో సంబంధం లేకుండా ఆమెను సినీ ప్రేమికులు ఆదరిస్తూ ఉంటారు, అభిమానిస్తూ ఉంటారు. ఆమెను చాలా మంది తమ భాషల సినిమాల్లో చూడాలని కోరుకుంటూ ఉంటారు.


స్టార్‌ కిడ్ అయినా కూడా ఇండస్ట్రీ లో రాణించేందుకు ఆలియా చాలా కష్టపడింది. అవకాశాలు ఈజీగా వచ్చినా కూడా సక్సెస్‌, స్టార్‌ డమ్ మాత్రం ఆలియాకు అంత ఈజీగా రాలేదు అని చెప్పాలి. తన అందంతో పాటు నటన ప్రతిభతో దేశవ్యాప్తంగా సినీ ప్రేమికుల అభిమానం ను దక్కించుకుంది. సోషల్‌ మీడియాలో ఈ అమ్మడి జోరు గురించి ఎంత చెప్పినా తక్కువే.


దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున ఆలియాను ఇన్ స్టా లో ఫాలో అవుతూ ఉంటారు. హిందీ తో పాటు తెలుగు ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో కూడా నటించిన ఆలియా ముందు ముందు మరిన్ని సౌత్‌ ఇండియన్ సినిమాల్లో నటించాలని కోరుకునే వారు చాలా మందే ఉన్నారు. పెళ్లి అయ్యి, తల్లి అయిన తర్వాత కూడా ఆలియా జోరు కొనసాగుతూనే ఉంది.

తాజాగా మరోసారి ఈ అమ్మడు తన అందాల ఆరబోత ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. క్లీ వేజ్ షో తో పాటు థైస్ అందాలను చూపిస్తూ తాజా ఫోటో షూట్ తో ఆలియా భట్‌ మతి పోగొడుతోంది. ఈ రేంజ్ అందాల ఆరబోత బాలీవుడ్‌ ముద్దుగుమ్మల్లో కేవలం ఆలియాకి మాత్రమే సాధ్యం అన్నట్లుగా నెటిజన్స్ మాట్లాడుతున్నారు.

మెరూన్ కలర్‌ మోడ్రన్ ఔట్ ఫిట్ లో కవ్వించే చూపులతో ఆలియా ను ఇలా చూస్తూ ఉంటే చూపు తిప్పుకోవాలి అనిపించడం లేదు అన్నట్లుగా కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు. టాలీవుడ్ లో పలువురు హీరోలను తన అభిమాన నటులుగా చెప్పిన ఆలియా మళ్లీ ఎప్పుడు తెలుగు సినిమా లో నటిస్తుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Tags:    

Similar News