అల్లరి నరేష్.. మరో ప్రయోగానికి దక్కిన లాభం

తనని తాను కొత్తగా రిప్రజెంట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు.

Update: 2024-11-21 10:57 GMT

అల్లరి నరేష్ ఈ మధ్యకాలంలో కథల ఎంపికలో తన ఛాయస్ మార్చుకున్నారు. ఒకప్పుడు వరుసగా కామెడీ కథలతో మూవీస్ చేసిన నరేష్ ఇప్పుడు వాటిని పక్కన పెట్టారు. కామెడీ కథలు చేయడానికి ఆసక్తి ఉన్న కూడా కచ్చితంగా ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తాయనే నమ్మకం కలిగితేనే ఒకే చెప్పాలని డిసైడ్ అయ్యారు. అలాగే కొన్ని సీరియస్ కంటెంట్ లని కూడా ఒప్పుకుంటున్నారు. తనని తాను కొత్తగా రిప్రజెంట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు.


అందుకే హీరోగా అన్ని రకాల కథలు, పాత్రలు చేయాలని డిసైడ్ అయిన నరేష్ ‘నాంది’ మూవీ నుంచి కథల ఎంపికలో కాస్తా భిన్నంగా ఆలోచిస్తున్నాడు. ఇదిలా ఉంటే అల్లరి నరేష్ సుబ్బు దర్శకత్వంలో ‘బచ్చలమల్లి’ అనే సినిమాని కంప్లీట్ చేశాడు. ఇది రియల్ లైఫ్ సంఘటనల స్ఫూర్తితో తెరకెక్కింది. ఇందులో నరేష్ కోపిష్టి హీరోగా కనిపిస్తున్నాడు. అతని క్యారెక్టరైజేషన్ చాలా భిన్నంగా ఉండబోతోంది.

ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన గ్లింప్స్ సినిమాపై అంచనాలు క్రియేట్ చేసింది. అతని లుక్ కూడా చాలా ప్రామిసింగ్ గా ఉంది. అందుకే ఈ సినిమా నరేష్ కి హిట్ ఇస్తుందని అనుకుంటున్నారు. హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా బిజినెస్ డీల్స్ క్లోజ్ అయినట్లు తెలుస్తోంది. థీయాట్రికల్, నాన్ థీయాట్రికల్ రైట్స్ ని ఫ్యాన్సీ ధరకి అమ్మేసారంట.

ఈ సినిమాని 15 కోట్ల బడ్జెట్ తో నిర్మించినట్లు తెలుస్తోంది. అయితే మొత్తం ఈ చిత్రంపై 16 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. అంటే టేబుల్ ప్రాఫిట్ తోనే ఈ మూవీ థియేటర్స్ లోకి రాబోతోంది. డిసెంబర్ 20న ఈ సినిమాని రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు. ఆ సమయంలో పోటీలో కేవలం ‘రాబిన్ హుడ్’ మూవీ మాత్రమే ఉంది. ‘గేమ్ చేంజర్’ ని డిసెంబర్ 20కి ఎనౌన్స్ చేశారు.

అయితే మరల రిలీజ్ డేట్ ని సంక్రాంతికి మార్చారు. దీంతో ‘బచ్చలమల్లి’ని డిసెంబర్ 20కి తీసుకొని రావాలని డిసైడ్ అయ్యారంట. త్వరలో టీజర్ రిలీజ్ చేసి మూవీ విడుదల తేదీని ఎనౌన్స్ చేసే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. ఈ సినిమాతో ఎలా అయిన సూపర్ సక్సెస్ అందుకోవాలనే కసితో అల్లరి నరేష్ ఉన్నారు. మూవీ హిట్ అయితే మాత్రం ఇలాంటి డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ మరిన్ని సినిమాలు చేసే అవకాశం ఉండొచ్చని అనుకుంటున్నారు.

Tags:    

Similar News