బన్నీ - అట్లీ కథలో రెండు సినిమాలు
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు టాలీవుడ్‌లోనే కాదు, పాన్ ఇండియా రేంజ్‌లో ట్రెండ్ సెట్టర్‌గా మారిపోయాడు.;

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు టాలీవుడ్‌లోనే కాదు, పాన్ ఇండియా రేంజ్‌లో ట్రెండ్ సెట్టర్‌గా మారిపోయాడు. ‘పుష్ప 2’ తర్వాత వచ్చే సినిమా పైనే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఫోకస్ ఉంది. ఈ క్రేజ్‌ను మరింతగా క్యాష్ చేసుకోవాలని బన్నీ, స్టార్ డైరెక్టర్ అట్లీతో చేతులు కలిపాడు. మాస్, కమర్షియల్, ఎమోషనల్ అంశాలను కలిపి హై ఓల్టేజ్ స్టైల్లో కథలు చెప్పడంలో అట్లీకి మంచి పట్టు ఉంది. అందుకే బన్నీ తదుపరి ప్రయాణం అట్లీతో అంటే బజ్ మామూలుగా ఉండదు.
ఇప్పటికే ఈ సినిమాలో బన్నీ రెండు విభిన్న గెటప్స్‌లో కనిపించనున్నాడనే వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రాకపోయినా, బన్నీ తరఫు నుంచి వచ్చిన తాజా హింట్లు చూస్తే ఇదంతా రూమర్స్ కాదనిపిస్తోంది. ఓ పక్క ట్రెండ్‌ను మార్చేలా ప్రయోగాలు చేసే బన్నీ.. మరోవైపు ఓ భారీ విజన్ ఉన్న డైరెక్టర్ అయిన అట్లీ.. అందుకే ఈ కాంబినేషన్‌కు క్రేజ్ పెరిగిపోతోంది.
అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి వినిపిస్తున్న గాసిప్ ఒకటి చాలా ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఒకే కథతో అట్లీ రెండు సినిమాలు చూసినంత థ్రిల్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అంటే కథ అంతా పునర్జన్మ కాన్సెప్ట్ చుట్టూ తిరుగుతుందని సమాచారం. మగధీర, మనం లాంటి హిట్ సినిమాలు రీబర్త్ ఐడియాతోనే పనిచేశాయి. ఇప్పుడు అదే బాటలో బన్నీ కూడా ఈ సెంటిమెంటల్ యాక్షన్ డ్రామాకు శ్రీకారం చుడుతున్నాడట.
ఇందులో అతను పునర్జన్మతో ముడిపడిన రెండు జీవితాల్లో కూడా హీరోగా కనిపిస్తాడని టాక్. ఒకటి పీరియాడిక్ షేడ్.. మరొకటి ప్రస్తుత కాలానికి తగిన మాస్ గెటప్. రెండు జన్మలలో డిఫరెంట్ ఎమోషన్స్ యాక్షన్స్ ఉండేలా కథను లింక్ చేస్తారట. ఫస్ట్ హాఫ్ ఒకలా సెకండ్ హాఫ్ ఒకలా ఉంటుందని టాక్. ఇక గెటప్స్ పరంగా కూడా చాలా తేడా ఉంటుందట. అంటే రెండు సినిమాలు చూసినంత ఫ్రెష్ నెస్ తో కథను లింక్ చేస్తున్నట్లు టాక్.
ఇద్దరు బన్నీలు ఒకే సమయంలో స్క్రీన్‌పై కనిపించరు గానీ, కథలో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయట. ఈ సినిమా స్క్రిప్ట్‌ను అట్లీ చాలా కాలంగా డెవలప్ చేస్తున్నాడట. కథా నేపథ్యం పరంగా యుద్ధాలు, రాజకీయం కాకుండా కమర్షియల్ ఎమోషన్‌తో కూడిన స్టైల్‌లో పునర్జన్మను చూపించనున్నాడట. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కీలకంగా ఉంటుందనీ, దానికి హై బడ్జెట్ మేకింగ్ అవసరం అవుతుందనీ సమాచారం. అందుకే ఈ ప్రాజెక్ట్‌కి భారీగా ప్లాన్ చేస్తున్నారని టాక్. గీతా ఆర్ట్స్ – సన్ పిక్చర్స్ కలిసి నిర్మించే ఈ సినిమా కోసం టాప్ టెక్నీషియన్స్ రంగంలోకి దిగే అవకాశం ఉంది.
పుష్ప 2 తర్వాత బన్నీ మళ్లీ స్క్రిప్ట్ విషయంలో చాలా డిమాండింగ్‌గా ఉన్నాడు. కథా పరంగా ఏ లోపం ఉండకూడదని క్లియర్‌గా చెప్పాడట. అట్లీ కూడా అదే స్థాయిలో జాగ్రత్తగా స్క్రిప్ట్‌ను మలుచుకుంటున్నాడట. ఫైనల్ వెర్షన్ మార్చి చివరి వారంలో రెడీ అవుతుందట, ఇక ఏప్రిల్ 8న బన్నీ పుట్టినరోజున అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.