ఆ నలుగురు మధ్య ఏంటీ గందరగోళం!
నిన్న మొన్నటి వరకూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తదుపరి సినిమా ఎవరితో? అంటే త్రివిక్రమ్ తోనని ఠకీమని చెప్పేవారంతా. కానీ ఇప్పుడు సీన్ మారింది.
నిన్న మొన్నటి వరకూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తదుపరి సినిమా ఎవరితో? అంటే త్రివిక్రమ్ తోనని ఠకీమని చెప్పేవారంతా. కానీ ఇప్పుడు సీన్ మారింది. తాజాగా ఈ వరుసలోకి మళ్లీ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ వచ్చి చేరాడు. వాస్తవానికి అట్లీ పేరు చాలా కాలంగా వినిపిస్తుంది. అయితే మధ్యలో అట్లీ మళ్లీ సల్మాన్ ఖాన్ తో సినిమా చేస్తున్నా డనే ప్రచారం మొదలవ్వడంతో బాలీవుడ్ కి వెళ్లిపోతున్నాడని అనుకున్నారంతా.
బన్నీ రిజెక్ట్ చేసిన స్టోరీనే అట్లీ సల్మాన్ తో చేస్తున్నాడని ప్రచారం జరిగింది. దీంతో త్రివిక్రమ్ కి లైన్ క్లియర్ అయినట్లు అయింది. దీంతో ప్రాజెక్ట్ లాక్ అయిందని అంతా భావించారు. అయితే తాజాగా మళ్లీ అట్లీ పేరు బన్నీ విషయంలో తెరపైకి వస్తోంది. త్రివిక్రమ్ ప్రాజెక్ట్ కి సంబంధించి ఇంకా బౌండెడ్ స్క్రిప్ట్ సిద్దంగా లేదని... అటు అట్లీ సల్మాన్ తో అనుకున్న ప్రాజెక్ట్ రద్దవుతుందని... ఈనేపథ్యంలో బన్నీ -అట్లీ మళ్లి కలుస్తున్నారనే ప్రచారం సోషల్ మీడియలో పెద్ద ఎత్తున జరుగుతుంది.
మళ్లీ త్రివిక్రమ్ ని హైడ్ చేస్తూ టాలీవుడ్ మీడియా అట్లీని పైకి లేపుతుంది. గురూజీ వద్ద పాన్ ఇండియా స్క్రిప్ట్ సిద్దంగా లేకపోవడం ఓ కారణమైతే? త్రివిక్రమ్ కి పాన్ ఇండియా అన్నది డెబ్యూ . ఇంత వరకూ అతడు పాన్ ఇండియా సినిమాలు తీయలేదు. ఈ నేపథ్యంలో బన్నీ కి త్రివిక్రమ్ అనే ఆప్షన్ వ్రాంగ్ అనే ప్రచారం సైతం మరోవైపు జరుగుతోంది. ఈ నేపథ్యంలో బన్నీ అట్లీవైపు మొగ్గు చూపుతున్నాడన్నది కొందరి మాటగా వినిపిస్తుంది.
అటు సల్మాన్ ఖాన్ తో అట్లీ ప్రాజెక్ట్ రద్దవ్వలేదని...స్టోరీ లాక్ అయినట్లు మళ్లీ ప్రచారం ఊపందుకుంది. మరోవైపు బన్నీ అట్లీతో పాటు త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ని ఏకకాలంలో పట్టాలెక్కించనున్నట్లు వార్తలొస్తున్నాయి. మొత్తంగా బన్నీ, సల్మాన్ , అట్లీ, త్రివిక్రమ్ నలుగురి మధ్య సినిమాల విషయంలో చాలా గందరగోళం కనిపిస్తుంది. ఎవరు ఎవరితో చేస్తున్నారు? ఎవరి ప్రాజెక్ట్ ముందుగా పట్టాలెక్కుతుంది? ఇలా చాలా కన్ప్యూజన్ ఏర్పడుతుంది. దీనిపై పూర్తి క్లారిటీ రావాలంటే బన్నీ సహా ఇతరుల నుంచి క్లారిటీ రావాల్సిందే.